ఇంట్రెస్టింగ్: లైగర్ కోసం ఇష్టమైన దాని వదిలేసిన విజయ్ దేవరకొండ..!!

లైగర్.. లైగర్.. లైగర్.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పదం ట్రెండింగ్ లోకి వస్తుంది. అంతకుముందు లైగర్ అంటే పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం లైకర్ అంటే అందరూ విజయ్ దేవరకొండ ని చూస్తున్నారు. అంతలా ఆయన లైగర్ అనే పదం పై ఇంపాక్ట్ వేసుకున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రమే ఈ లైగర్. టాలీవుడ్ స్టార్ డెరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కరణ్ జోహార్, మరియూ పూరి జగన్నాధ్ పూరి కనెక్ట్ పై నిర్మిస్తున్నారు.

ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ పనులను లైగర్ టీం చకచకా ఫినిష్ చేస్తున్నారు . ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు లైగర్ టీం. సడన్ గా బాయ్ కాట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకు రావడం పై ఎవ్వరు ఊహించని విధంగా విజయ్ దేవరకొండ రెస్పాండ్ అవ్వడం సంచలనంగా మారింది. “కష్టపడి సినిమాను తీసాం బాయ్ కాట్ చేస్తారా చేసుకోండి ..మాకేం ప్రాబ్లం లేదు” అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ ప రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Liger Movie Review Out: Vijay Deverakonda, Ananya Panday's movie is HIT or  FLOP? Read what 'Censor Board' says

[కాగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎన్నో త్యాగాలు చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనకు తెలిసిందే లైగర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. అంటే బాక్సింగ్ నేపథ్యంలో పెరగడం వల్ల విజయ్ దేవరకొండ సినిమా కోసం కఠిన వ్యాయమాలు ..ఫుడ్ డైట్ ఫాలో అయ్యారు . దీని కారణంగా విజయ్ దేవరకొండ తనకి ఇష్టమైన డ్రింకును కూడా దూరం పెట్టారట . ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకోరావడం విశేషం. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయట పెట్టాడు. “సినిమాలో తన బాడీ ఫిజిక్ చాలా బాగా నచ్చిందని దీనికోసం నేను చాలా వ్యాయామాలు కఠిన డైటింగ్ లు ఫాలో అయ్యానని. అంతేకాదు దీనికోసం ఆల్కహాల్ కూడా దూరం పెట్టానని” విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మాటలు వైరల్ గా మారాయి. మరి చూడాలి లైగర్ కోసం ఇన్ని త్యాగాలు చేసిన విజయ్ దేవరకొండ సక్సెస్ అవుతాడో లేదో..?