భార్య కోసం సుకుమార్ సంచలన నిర్ణయం.. షాక్ అవుతున్న సినీ ప్రముఖులు ?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సుకుమార్ సినిమాని మొదలుపెట్టినప్పుడే రెండు భాగాలుగా చేస్తానని చెప్పాడు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానిలే కాకుండా… ఇండియ‌న్‌ సినీ అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Pushpa 2: Sequel To Allu Arjun's Magnum Opus Is Arriving On This Date, Mark  It On Your Calendar!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో పుష్ప‌ మూడో సినిమాగా వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మికా మందన్నా నటించారు. పుష్ప సినిమా హిట్ అవటంతో పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. షూటింగ్ మొదలుకాకుండానే సినిమాకి భారీ ఆఫర్స్ వస్తుండగా దర్శకుడు సుకుమార్ అయితే ఈ సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి త‌న భార్య కోరిక మేర‌కు నిర్మాణ భాగ‌స్వామిగా మారాడ‌ని తెలుస్తుంది. దీంతో ఈ సినిమాకి సుకుమార్ పై అదనపు బాధ్యత పడినట్టు చెప్పాలి. సుకుమార్ డేరింగ్ స్టెప్‌కు ఇప్పుడు ఇండ‌స్ట్రీ వాళ్లు కూడా చ‌ర్చించుకుంటున్నారు. పుష్ప‌2కు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మలయాళీ హీరో ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ మరి కొంతమంది నటీమణులు నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేస్తారు.

Share post:

Latest