నివేద థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకిని డాకిని. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాని దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ సినిమా అయిన మిడ్ నైట్ రన్నర్స్ కి రీమేక్ గా తీస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
ఈ సినిమా టీజర్ లోప్రధానంగా నివేద ఫుడ్ లవర్ గాను, రెజీనాను ఓసిడి అమ్మాయి క్యారెక్టర్ లో చూపించారు. వీరిద్దరూ ఒక పోలీస్ అకాడమీలో శిక్షణకి చేరుతారు. అక్కడ వీళ్లిద్దరూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి ? వీళ్ళిద్దరి మధ్య వైరం… వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా ఎలా మారారు అనేది చూపించారు. తర్వాత వీరిద్దరితో మాస్ ఫైట్స్ సీన్స్ చూపించారు. ఇక నివేదా కెరీర్‌లో ఫస్ట్ టైం కాస్త షాకింగ్ రోల్ చేస్తోంది.
టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. డైరెక్టర్ ఈ స్టోరీని కొరియన్ సినిమా నుంచి తీసుకున్న తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాడు. అయితే రెజీనా తన సినీ కెరియర్ లో ఇప్పుడు దాకా చాలా ప్లాప్‌లే చూసింది. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు. ప్రస్తుతం ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని చూస్తుంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.