క్రికెట్ అభిమానులు కోరుకున్న వేళ రానే వచ్చింది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇందులో అందరి చూపు భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌ల పైనే ఉంది. ఈ రెండు టీములు గ్రూప్ బి నుండి ఆగస్టు 28 తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్ పాత రికార్డులను చూస్తే పాకిస్తాన్ పై భారత్ ఎక్కువగా విజయాలు సాధించింది. ఇప్పటివరకు ఆసియా కప్ లో భారత్ – పాకిస్తాన్ జట్లు మొత్తంగా 14 సార్లు తలబడ్డాయి. ఇందులో భారత్ 8 సార్లు గెలిచింది. పాకిస్తాన్ కేవలం భారత్ ను 5 సార్లు ఓడించింది. ఇందులో ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
గత టి20 ప్రపంచ కప్ తర్వాత మొదటిసారిగా భారత్- పాకిస్తాన్ జట్లు ఒకే వేదికపై మ్యాచ్ లూ ఆడునున్నాయి. గత సంవత్సరం తొలిసారిగా ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించింది పాకిస్తాన్. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీం ఇండియా పట్టుదలతో ఉంది. ఇదే క్రమంలో ఇరు జట్లకు కొలుకోలేదని దెబ్బ తగిలింది. టీ 20 ఫార్మాట్ లో భారత్ -పాకిస్తాన్ జట్లు చాలా దృఢంగా ఉన్నాయి. టీం ఇండియాలో రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ లాంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు.
పాకిస్తాన్ టీం లో బాబా ఆజం, ఫకర్ జమాన్, మహమ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నారు. బాబర్, రిజ్వాన్ టీ 20 క్రికెట్లోనే ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. ఇదే సందర్భంలో రెండు జట్లు తమ ప్రధాన ఫాస్ట్ బౌలర్లను కోల్పోయారు. టీమిండియా కు వెన్నునొప్పి కారణంగా బూమ్రా, పాక్ నుంచి షాహీన్ షా ఆఫ్రిది మోకాలి గాయంతో టోర్నీకి దూరం కావడంతో ఈ రెండు జట్ల బౌలింగ్‌కు ఎదురు దెబ్బే..!