ఏకంగా నలుగురితో ప్రేమాయణం నెరిపిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

సినీరంగంలో వున్న నటీనటుల జీవితం కాస్త అస్తవ్యస్తంగా ఉంటుంది. చూడటానికి దూరపు కొండలు నునుపు మాదిరి వున్నా.. దగ్గరికెళితే అంతా గుట్టలమయం అన్న మాదిరి ఉంటుంది. ముఖ్యంగా సినిమా హీరోయిన్లు జీవితం కాస్త బాధాకరంగానే ఉంటుంది. ఏ కొద్దిమందో కాస్త చాకచక్యంగా వ్యవహరిస్తూ… బతికేస్తూ వుంటారు. కానీ అనేకమంది నటీమణుల రంగురంగుల జీవితం వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. సినీ జీవితం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ప్రేమ, పెళ్ళి వంటి బంధాలకి శాశ్వతంగా దూరమౌతారు.

అలాంటివారు కేవలం ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాదు.. యావత్ ప్రపంచ సినిమా చరిత్రలో మనకు తారసపడుతూ వుంటారు. ఇకపోతే ఇపుడు మన తెలుగు సినిమాలో వెలిగిన ఓ తార గురించి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించి “ఘరానా బుల్లోడు” చిత్రంతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బ్యూటిఫుల్ హీరోయిన్ “నగ్మ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే నటి నగ్మ స్వతహాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి తనకంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సినిమా ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నగ్మ తన వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందనే వాదనలు వినబడతాయి. దీంతో ప్రస్తుతం దాదాపుగా 47 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటోంది. అయితే అప్పట్లో నటి నగ్మ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గంగూలీతో ప్రేమలో పడిన సంగతి విదితమే. అది బెడిసి కొట్టిన తరువాత నగ్మ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరో తో ప్రేమలో పడిందని పుకార్లు వినిపించాయి. ఆ తంతుకూడా అర్ధాంతరంగా ముగియడంతో మరొకరిని ప్రేమించిందని, ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ప్రేమలో విఫలమైందని దాంతో నగ్మ కి ప్రేమ బంధం పై నమ్మకం పోయిందని అందువల్లనే ఇకపై తన వైవాహిక జీవితంలోకి మరో వ్యక్తిని ఆహ్వానించకూడదని నిర్ణయం తీసుకుందని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.