పవన్..బ్యాలన్స్ అవ్వట్లేదే..!

ఏపీలో పవన్ టార్గెట్ ఒక్కటే అది…జగన్‌ని గద్దె దించడం…నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం రాకుండా చేయాలనేది పవన్ లక్ష్యం. అందుకే వైసీపీ విముక్త ఏపీ అనే నినాదంతో పవన్ పనిచేయడం మొదలుపెట్టారు. అయితే జగన్‌ని ఓడించడం పవన్ వల్ల అవుతుందా? అంటే ఏ మాత్రం డౌట్ లేకుండా అవ్వదు అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్‌కు బలం చాలా తక్కువ…ఇప్పుడు ఏపీలో జగన్‌కు 50 శాతం బలం ఉంటే…పవన్‌కు 10 శాతం కూడా లేని పరిస్తితి.

మరి అలాంటప్పుడు పవన్…వైసీపీ విముక్త ఏపీ అనే నినాదం ఎలా ఇస్తున్నారు? అంటే అది చంద్రబాబుని చూసుకునే అని చెప్పాలి. ఏపీలో వైసీపీ తర్వాత బలంగా ఉంది టీడీపీనే ఆ పార్టీకి 40 శాతం వరకు ఓటింగ్ ఉంది. టీడీపీతో కలిసే జగన్‌ని గద్దె దించాలనేది పవన్ ప్లాన్. కాకపోతే ఆ విషయం క్లారిటీగా చెప్పడంలో పవన్ విఫలమవుతున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని పదే పదే చెబుతున్నారు.

కానీ టీడీపీతో పొత్తు ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పడం లేదు. కాసేపు టీడీపీ-బీజేపీ-జనసేన పోటీ చేస్తాయని అంటారు…లేదు తమకు ఎవరితో పొత్తు లేదని, ప్రజలతోనే పొత్తు ఉందని ఇంకోసారి మాట్లాడతారు. తాజాగా కూడా ఇలా బ్యాలన్స్ లేని మాటలు పవన్ మాట్లాడారు. టీడీపీతో పొత్తు ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు…కానీ ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని మళ్ళీ చెప్పారు.

అంటే ఏ మాత్రం పొంతన లేకుండా మాట్లాడుతున్నారు..వైసీపీ వ్యతిరేకత ఓట్లు చీలకూడదు అంటే ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. పొత్తు లేకుండా వైసీపీని గద్దె దించలేరు. అయితే ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని ఇలా మాట్లాడుతున్నారా? లేక వైసీపీని ఇరుకున పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అంటే అప్పుడే పొత్తు ఉందని చెప్పి…టీడీపీ-జనసేన ఒకటే అని ప్రజల్లోకి వెళితే ఇబ్బంది అని చెప్పి…పవన్ ఇలా బ్యాలన్స్ లేకుండా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.