మ‌హేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌… అదిరిపోతుందా…!

తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్‌ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో 350 పైగా థియేటర్లో విడుదలైంది. రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది.

Pokiri - Disney+ Hotstar

పోకిరి సినిమా ఇన్ని సంవత్సరాలు తర్వాత వచ్చినా కూడా ఇంత మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోకిరి సినిమా మళ్లీ విడుదలై రెండున్నర కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల గురించి చర్చ ఇంక జరుగుతూనే ఉంది. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు సినిమాను మళ్లీ థియేటర్లోకి తీసుకు వ‌స్తున్నారు. మెగాస్టార్ అభిమానులు రెండు రాష్ట్రాల్లో దాదాపుగా 150 స్క్రీన్ లో ఈ సినిమా షోలు ర‌న్ చేస్తున్నారు.

Watch Gharana Mogudu on ott streaming online

ప్రధానంగా హైదరాబాదులో ఉన్న అన్ని ప్రముఖ సింగిల్ స్క్రీన్ ధియేటర్లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. ఇప్ప‌టికే చాలా షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. మొన్న పోకిరి వ‌సూళ్ల‌తో మ‌హేష్ అభిమానుల హంగామాను మించి ఇప్పుడు చిరు అభిమానులు చేస్తున్నారు. ఘరానా మొగుడు సినిమాకు వచ్చే వసూళ్లతో మహేష్ బాబు అభిమానులకు కౌంటర్ ఇచ్చేందుకు క‌సితో కాచుకుని ఉన్నారు. అయితే మ‌హేష్ సినిమా రి రిలీజ్ అయిన‌న్ని స్క్రీన్ల‌లో ఘ‌రానా మొగుడు రిలీజ్ కావ‌డం లేదు.