ఈ సినిమాలు చేసుంటే విజయ్ దేవరకొండ కెరీర్ మరోలా ఉండేది..జస్ట్ మిస్..!!

ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి హీరోలుగా సక్సెస్ అవటం అంటే కష్టమనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న కుర్ర హీరోల్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌చ్చి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. విజయ్ తన మొదటి సినిమా నుండే చాలా వైవిధ్యమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఒక్కో సినిమాకు తన ఇమేజ్ పెంచుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ కొన్ని హిట్ సినిమాలు వదులు కొన్నాడు. అవి కూడా చేసి ఉంటే విజ‌య్ కెరీర్ మ‌రో రేంజ్‌లో ఉండేది. ఇప్పుడు ఆ సినిమాలు మనం చూద్దాం.

యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమాను ముందుగా ఈ కథను డైరెక్టర్ విజయ్ కి చెప్పారు. తన డేట్స్ కుదరక ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. డైరెక్టర్ వెంకీ కుడుముల ఇదే కథను నితిన్ తో తీసి హిట్ కొట్టాడు. పూరి జగన్నాథ్ కం బ్యాక్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ముందుగా ఈ కథను పూరి విజయ్ కి చెప్ప‌గా కథ నచ్చక విజయ్ రిజెక్ట్ చేశాడు. పూరి ఇదే కథను రామ్‌తో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో రామ్ కి మాస్‌లో మంచి ఇమేజ్ వచ్చింది. నూతన దర్శకుడు అజయ్ భూపతి తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడురు. తను ఆర్ఎక్స్ 100 కథను ముందుగా విజయ్ కు చెప్పినా కొన్నికార‌ణ‌ల వ‌ల్ల‌ ఈ సినిమాను రిజెక్ట్ చేయ‌గా ఇదే కథతో యంగ్ హీరో కార్తికేయతో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.

డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన నూతన దర్శకుడు బుచ్చి బాబు ఉప్పెన‌ కథను ముందుగా విజయ్ దేవరకొండకు చెప్పారట. విజయ్‌కు ఈ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు. ఇదే కథతో వైష్ణవ తేజ్ తో సినిమా తీయ‌గా అది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండకు మంచి పేరు తెచ్చిపెట్టిన రొమాంటిక్ మూవీ అర్జున్ రెడ్డిని కూడా హిందీలో విజయ్‌తో రీమిక్స్ చేద్దాం అనుకున్నారు. దీనికి విజయ్ దేవరకొండ ఒప్పుకోలేదు. విజయ్ డియర్ కామ్రేడ్ ని పాన్ ఇండియా లెవెల్లో తీయాల‌ని అనుకోవ‌డంతో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ చేసేందుకు ఒప్పుకోలేదు.

ఒక వేళ విజ‌య్ పైన వ‌దులుకున్న సినిమాలు చేసి ఉంటే అత‌డి క్రేజ్ ఖ‌చ్చితంగా మ‌రోలా ఉండేది.
ప్ర‌స్తుతం విజ‌య్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ పూరితోనే జ‌న‌గ‌ణ‌మ‌న చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ రెమ్యూనిరేషన్ 25 కోట్లరూపాయలు అని తెలుస్తోంది.