అల్లు వారింట్లో చిచ్చు పెడుతున్న సో కాల్డ్ నిర్మాత… అల్లు అర్జున్ బెల్టు తీస్తాడేమో చూడాలి?

ఈ మధ్య ఓ సినిమా నిర్మాత తరచూ మీడియా ముందుకు వచ్చి వింత వింత విషయాలు మాట్లాడుతూ వున్నాడు. అతడు మరెవరో కాదు నిర్మాత నట్టి కుమార్. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అల్లు అరవింద్ కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాటి గురించి తాజాగా నట్టి కుమార్ తనదైన రీతిలో స్పందించారు.

అల్లు అర్జున్ ప్రస్తుతానికి పుష్ప సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. తనకు ఇద్దరు సోదరులు ఉన్నారనే విషయం తెలిసినదే. అందులో అల్లు బాబీ, శిరీష్ లు సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నా ఇంకా అంత సక్సెస్ అవ్వలేదు. అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీ లో బిజినెస్ పరంగా ఒకప్పుడు నెంబర్ వన్ గా ఉన్నారు ప్రస్తుతం దిల్ రాజు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక కొడుకుల్లో అల్లు అర్జున్ సక్సెస్ అయినట్లు మిగిలిన ఇద్దరూ అవ్వలేదు. ఈ క్రమంలో శిరీష్ తన అన్న అల్లు అర్జున్ మీద అలిగి ముంబై వెళ్లిపోయాడంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం వీటి పై నట్టి కుమార్ మాట్లాడుతూ… ఈ విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు అని స్పందించాడు. అల్లు అరవింద్ అంటే తనకు పెద్దగా పడదు అని, ఫిల్మ్ ఛాంబర్ రాజకీయాల్లో నాకు వ్యతిరేక వర్గానికి అయన చెందినవాడు, కాబట్టి వాళ్ళ విషయాలు నాకు పెద్దగా తెలియవు అని అన్నాడు. అయితే వారి కుటుంబంలో ఎలాంటి చీలిక అయితే లేదు ఇవన్నీ పుకార్లే అంతే అంటూ స్పందించారు. మెగాస్టార్ అనే మహా వృక్షం నుండి వీళ్లందరూ వచ్చారు, అది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అని చెప్పుకొచ్చాడు.

Share post:

Latest