నెల్లూరులో సై’కిల్’..’ఫ్యాన్’ హవా!

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి…ఇప్పుడు ఏదో ఎన్నికలు జరిగిపోతున్నట్లే వైసీపీ-టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. అసలు ఎవరికి వారు అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్నారు…మరొకసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తున్నాయి. ఇలా ఎన్నికలకు సమయం ఉండగానే పార్టీల రాజకీయం వల్ల…రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పైగా ఎప్పటికప్పుడు పార్టీల బలబలాలపై సర్వేలు, విశ్లేషణలు కూడా వస్తున్నాయి.

జిల్లాల వారీగా రాజకీయ పరిస్తితులు ఎలా మారుతున్నాయనే దానిపై విశ్లేషణలు ఎక్కువ వస్తున్నాయి…ఇదే క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయనే దానిపై పలు సర్వేలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…నెల్లూరులో మళ్ళీ వైసీపీ హవానే నడుస్తుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

The Biggest Campaign Worked For YSR Congress Party

ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కాస్త వైసీపీ బలం తగ్గింది గాని…టీడీపీ బలం పెద్దగా పెరగలేదని తెలుస్తోంది. పూర్తిగా జిల్లాలో టీడీపీ కోలుకోలేదని సమాచారం. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పూర్తి స్థాయిలో యాక్టివ్ గా పనిచేయకపోవడం, ఏదో మీడియాలో హడావిడి చేయడం తప్ప క్షేత్ర స్థాయిలో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల..నెల్లూరులో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉందని తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో టీడీపీ పరిస్తితి మెరుగ్గానే ఉంది…కానీ నెల్లూరులో మాత్రం పుంజుకోలేదు.

గతంతో కంటే వైసీపీ బలం తగ్గింది గాని…ఓడిపోయేంత మాత్రం తగ్గలేదని సమాచారం. గత ఎన్నికల్లో 10 స్థానాల్లో భారీ మెజారిటీలు వచ్చాయి…కానీ ఇప్పుడు ఆ మెజారిటీలు కాస్త తగ్గుతాయి గాని…విజయం మాత్రం వైసీపీ వైపే ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 10 నియోజకవర్గాల్లో అదే పరిస్తితి ఉందని సమాచారం…ఒకవేళ ఎన్నికల సమయానికి టీడీపీ కాస్త పుంజుకుంటే రెండు, లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చని..కానీ మెజారిటీ సీట్లు మాత్రం వైసీపీకే దక్కనున్నాయి. మొత్తానికైతే నెల్లూరులో మళ్ళీ ఫ్యాన్ హవానే కొనసాగనుంది.