టీడీపీలో చిచ్చు పెట్టిన మోహన్ బాబు!

ఎన్నో ఏళ్లుగా టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా ఉంటున్న సినీ నటుడు మోహన్ బాబు..సడన్ గా దగ్గరయ్యే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం పనిచేసిన మోహన్ బాబుని…చంద్రబాబు ఎందుకు కలిశారు? అసలు చంద్రబాబు…మోహన్ బాబుని కలవడం టీడీపీ శ్రేణులు ఎందుకు నచ్చడం లేదు? ఈ ప్రశ్నలన్నీ తాజాగా ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. దశాబ్ద కాలం పైనే చంద్రబాబు-మోహన్ బాబుల మధ్య గ్యాప్ వచ్చింది. పైగా గత ఎన్నికల్లో వైసీపీలో చేరి టీడీపీ ఓటమి కోసం మోహన్ బాబు పనిచేశారు.

అలా వైరి వర్గంలో ఒకరిగా ఉన్న మోహన్ బాబు..సడన్ గా చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో రాజకీయం ఏమి లేదని, మోహన్ బాబు సొంత విద్యాసంస్థలు విద్యానికేతన్ లో నిర్మించిన సాయిబాబా ఆలయం ప్రతిష్టాపనకు చంద్రబాబుని ఆహ్వానించారని టాక్ నడుస్తోంది. అదే సమయంలో మోహన్ బాబు ఏదో రాజకీయ పరమైన చర్చలు కూడా నడిపినట్లు కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా గాని చంద్రబాబు-మోహన్ బాబు భేటీ చుట్టూ రాజకీయం బాగానే నడుస్తోంది.

ఇక ఆ భేటీలో ఏం జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు…కానీ మోహన్ బాబుతో భేటీ అవ్వడాన్ని తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అసలు టీడీపీ ఓటమి కోసం పనిచేసిన ఆయనతో చంద్రబాబు భేటీ అవ్వడం ఏంటి అని తమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబుని నెగిటివ్ చేసి…ఆయన్ని దెబ్బకొట్టాలని చూసిన వారిలో మోహన్ బాబు కూడా ఒకరు. అలాంటి వారితో బాబు భేటీ అవ్వడం ఎందుకు? అని చెప్పి.. టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.

పైగా ‘మా’ ఎన్నికల్లో మోహన్ బాబు ఫ్యామిలీ…మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎలా వెళ్ళిందో అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు మోహన్ బాబుతో కలిస్తే…టీడీపీకి అనుకూలంగా ఉన్న కాపు వర్గంలో వ్యతిరేకత పెరగొచ్చని అంటున్నారు.  ఇకనైనా బాబు ఆచితూచి వ్యవహరించాలని తమ్ముళ్ళు మాట్లాడుకునే పరిస్తితి. ఏదేమైనా మోహన్ బాబుతో భేటీ అవ్వడం  తమ్ముళ్ళకు ఏ మాత్రం నచ్చడం లేదు.