మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ కామెంట్స్.. ఫేక్ అంటోన్న హీరో!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది.

ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరిట సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. కొన్ని కులాల పేరుతో చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారడంతో పలువురు నెటిజన్లు మాచర్ల నియోజకవర్గం చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డిపై ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంపై ఇండస్ట్రీ వర్గాల్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి చేజారకముందే హీరో నితిన్ రంగంలోకి దిగాడు.

ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరుతో వస్తున్న కామెంట్స్ అన్నీ కూడా ఫేక్ అని.. అది ఆయన ఒరిజినల్ అకౌంట్ కాదని.. కావాలనే కొందరు ఇలా ఫేక్ అకౌంట్‌తో ఆయన పేరుపై ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నట్లుగా నితిన్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన డైరెక్టర్ పేరిట ఫేక్ అకౌంట్‌తో చేస్తున్న కామెంట్స్‌ను ఎవరూ పట్టించుకోవద్దంటూ నితిన్ తన అభిమానులను కోరారు.

Share post:

Latest