రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిజెక్ట్ చేసిన నాగార్జున.. కారణం..?

ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా ఒక హీరోను ఊహించుకొని కథను డైరెక్టర్ రాస్తే.. మరొక హీరో నటించడం లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని కథలు మాత్రం అందరి హీరోలకు సూట్ అయ్యే విధంగా ఉండవని చెప్పవచ్చు.. టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులలో ఒకరైన శరత్ మండవ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.. ఇక అందులో తను డైరెక్షన్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వాటి గురించి చూద్దాం.Is Nagarjuna replacing Ravi Teja? - mirchi9.com

డైరెక్టర్ శరత్ మండవ మాట్లాడుతూ నాగార్జునకు ఈ కథ ఎంతగానో నచ్చింది. అయితే నాగార్జున అప్పటికే మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని డైరెక్టర్ తెలిపారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్టును సిద్ధం చేశానని తెలిపారు. అయితే తాను హీరోని దృష్టిలో ఉంచుకొని ఈ కథను సిద్ధం చేయలేదని కేవలం స్టార్ హీరో నటిస్తే బాగుంటుంది అని ఉద్దేశంతోనే ఈ సినిమా కథను రాశానని శరత్ మండవ తెలిపారు. ఇక తర్వాత ఇదే కథతో రవితేజను సంప్రదించగా రవితేజ ఒప్పుకోవడం జరిగింది అని తెలిపారు. రవితేజకు ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయలేదని కూడా తెలిపారు.Ravi Teja's Ramarao On Duty Release Date Gets Postponedఅయితే రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలోని డైలాగులు కూడా రాశామని తెలిపారు డైరెక్టర్. మరి నాగార్జున ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో రవితేజ ఒప్పుకోవడంలో ఎవరు జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా రవితేజ కెరియర్ లోని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడం గమనార్హం. ఇక రవితేజ కెరియర్ కూడా ఈ సినిమా మీది డిపెండ్ అయ్యింది అని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జున కూడా ప్రస్తుతం ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు.