చినబాబుతో చిక్కులు..గద్దెకు ఎసరు?

తెలుగుదేశం పార్టీలో పవర్ సెంటర్లు పెరిగిపోయాయి..ఆ పార్టీ నేతలకు చంద్రబాబు టీం మాట వినాలో లేక చినబాబు టీం మాట వినాలో తెలియడం లేదు. మామూలుగా ఇప్పటివరకు చంద్రబాబు చెప్పినట్లే పార్టీ నడిచేది…కానీ గత కొంతకాలం నుంచి నారా లోకేశ్ టీం హవా పెరిగింది. ఎప్పుడైతే చినబాబు దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారో అప్పటినుంచి పార్టీలో పరిస్తితులు మారిపోయాయి. పార్టీలో చినబాబు పెత్తనం పెరిగాక సీనియర్లకు చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు.

ఎంతటి సీనియర్ నాయకుడైన చినబాబు ఆదేశాల ప్రకారమే పనిచేయాల్సిన పరిస్తితి ఉంది. ఈ విషయంలో చాలామంది సీనియర్లు అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. పైగా బుచ్చయ్య చౌదరీ లాంటి సీనియర్లు ఆ మధ్య ఓపెన్ గానే తన అసంతృప్తిని బయటపెట్టారు. అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తనకు ఎవడో ఆదేశాలు ఇవ్వడం ఏంటి? అని పరోక్షంగా చినబాబు టీమ్ పై ఫైర్ అయ్యారు.

అయితే బుచ్చయ్య లాంటి వారు బయటపడ్డారు గాని…మిగిలిన సీనియర్లు చంద్రబాబుని దృష్టిలో పెట్టుకుని సైలెంట్ గా పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఇక చినబాబు టీమ్ హడావిడి…నియోజకవర్గాల్లో కూడా ఉంటుందని తెలిసింది. పైగా చినబాబు సపోర్ట్ ఉందని చెప్పి కొందరు నియోజకవర్గాల్లో సీనియర్లని డామినేట్ చేసేలా రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొందరు సీటు తమకే అన్నట్లు ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు అంటా.

ఇదే క్రమంలో సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ని సైతం చినబాబు టీం ఇరకాటంలో పెడుతుందట. అసలు విజయవాడ తూర్పులో గద్దె బలం ఏంటో ప్రత్యర్ధులకు కూడా తెలుసు..ఎంతో సౌమ్యంగా రాజకీయం చేసే గద్దెని ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే పరిస్తితి ఉంటుంది. అలాంటి నాయకుడుకు చినబాబు టీం చుక్కలు చూపిస్తుందని తెలుస్తోంది. లోకేశ్ సపోర్ట్ ఉన్న కొందరు ఎన్‌ఆర్‌ఐలు అపుడప్పుడు విజయవాడ వచ్చి…తూర్పు టికెట్ తమదే అని చెప్పుకుంటున్నారట. పైగా ఒక ఎన్‌ఆర్‌ఐ కు చినబాబు హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీంతో గద్దె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా చినబాబు టీంతో పెద్ద చిక్కులు వచ్చేలా ఉన్నాయి.