లగడపాటి ఎంట్రీ ఇచ్చేస్తారా?

ఎందుకు తలుచుకున్నారో…ఏంటో గాని తెలంగాణ మంత్రి కేటీఆర్ సడన్ గా లగడపాటి రాజగోపాల్ పేరు తలుచుకున్నారు. తెలంగాణలో వస్తున్న సర్వేలపై కేటీఆర్ స్పందిస్తూ..ప్రతి సర్వేలోనూ తమ పార్టీదే విజయం అని రుజువైందని, ఇప్పుడు వచ్చినవన్నీ బీజేపీ, కాంగ్రెస్ అనుకూల సర్వేలు అని, వాటిల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నారని అన్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 90 లక్షల ఓట్లు తగ్గవని, తగ్గితే రాజకీయాల్లో ఉండనని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

ఇక రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ.. రాజకీయాల్లో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఇప్పటికే రెండుసార్లు రాజకీయ సన్యాసం అన్నారని, అసలు చెప్పాలంటే రేవంత్ కంటే లగడపాటి బెటర్ అని కేటీఆర్ మాట్లాడారు. అంటే రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు…అలాగే లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. కానీ గత ఎన్నికల్లో సర్వేల పేరుతో హల్చల్ చేశారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుస్తుందని అన్నారు. కానీ రెండు తేడా కొట్టాయి.

దీంతో మళ్ళీ సర్వేల జోలికి వెళ్లనని లగడపాటి అన్నారు. ఇంకా అప్పటినుంచి ఆయన సర్వేలు కనబడటం లేదు. అలాగే ఆయన సర్వేలు చేయిస్తున్నట్లు కూడా తెలియడం లేదు. అయితే లగడపాటికి సర్వేల అంటే మక్కువ అని, కాబట్టి ఆయన సర్వేలు చేయించడం మానడం కష్టమని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అప్పుడప్పుడు ఏదొక సందర్భంలో మీడియాలో కనిపిస్తూ…ప్రస్తుత రాజకీయాలపై కామెంట్ చేసే లగడపాటి…సర్వేలు బట్టే మాట్లాడతారని అంటున్నారు.

ఆయన సీక్రెట్ గా మాత్రం సర్వేలు చేయించే అవకాశాలు ఉన్నాయి…అవి ఎన్నికల ముందు బయటపెట్టే ఛాన్స్ కూడా లేకపోలేదని చెబుతున్నారు. కాకపోతే ఆయన ఓపెన్ గా బయటకొచ్చి సర్వేల గురించి మాట్లాడతారా లేదా? అనేది డౌట్ అంటున్నారు. మొత్తానికైతే లగడపాటి మళ్ళీ సర్వేలతో ఎంట్రీ ఇచ్చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి మళ్ళీ లగడపాటి ఎంట్రీ ఉంటుందో లేదో.

Share post:

Latest