దిల్ రాజు కష్టం వుట్టిపోలేదు.. రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి రెడీ అయిన బడా హీరోలు!

కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లో ఒక శూన్యం ఏర్పడింది. ప్రపంచం కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టనష్టాలకు గురైంది. అన్నింటికీ మించి జనాలు OTTలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పెరిగిన టిక్కెట్ల రేట్లు విషయం బెడిసి కొట్టింది. పెద్ద సినిమాలు ఓ రెండు మూడు అయితే బతికి బట్టగలిగాయి కానీ చిన్న సినిమాలు అది పరిస్థితి. ఈ క్రమంలో సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగులు ఆపేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

ఆ నిర్ణయానికి ఇప్పుడు మన బడా హీరోలు కూడా మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సినిమా నిర్మాణ వ్యయం తగ్గించే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా ముందుకెళ్లాలి? అనేది తేలే వరకు సినిమా షూటింగులు జరగకూడదని భావిస్తూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ విషయమై తాజాగా దిల్ రాజు సారథ్యంలో సమావేశమైన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి తమతో సినిమాలు చేస్తున్న హీరోలతో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ విషయమై రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో దిల్ రాజు చర్చించగా సినిమా పరిశ్రమ బాగుండాలంటే తాము రెమ్యూనరేషన్ లు తగ్గించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఈ ముగ్గురు హీరోలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇక మిగతా నిర్మాతలు కూడా తమ తమ సినిమాలు చేస్తున్న హీరోలతో చర్చలు జరిపితే ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి కూడా ఆరా తీసినట్లుగా సమాచారం. అసలు ఏం జరుగుతోంది? ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా హెల్ప్ చేసారని సమాచారం.