పొత్తులో ట్విస్ట్..అంతా వ్యూహాత్మకమే..!

టీడీపీ-జనసేన పొత్తు విషయంలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే…రెండు పార్టీలు నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వస్తుంది..ఆ రెండు పార్టీలు కలిస్తేనే వైసీపీని ఎదురుకోవడం సాధ్యమవుతుందని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోవడం వల్లే ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది చేకూరిందని, ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ టీడీపీ-జనసేన నష్టపోవడం ఖాయమని అంటున్నారు.

ఇదే క్రమంలో జగన్ ని గద్దె దించడానికి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అని పవన్ కల్యాణ్ ఆ మధ్య చెప్పుకొచ్చారు..అలాగే పొత్తుకు మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇటు చంద్రబాబు సైతం….పొత్తు ఉంటేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు…ఇదే క్రమంలో ఆయన…పవన్ తో పొత్తు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలిసింది. ఇక రెండు పార్టీలు కలిసి జగన్ పై కుట్ర చేస్తున్నారని, జగన్ ఒంటరిగానే సత్తా చాటుతారని, జగన్ కు ప్రజల మద్ధతు ఉందని చెప్పి..వైసీపీ నేతలు సెంటిమెంట్ లేపే ప్రయత్నాలు చేశారు.

దీంతో చంద్రబాబు, పవన్ పొత్తు విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది…అసలు ఇప్పుడు పొత్తు గురించి చర్చ ఉండకూడదని డిసైడ్ అయ్యి..ఎవరికి వారే సింగిల్ గానే పోటీ చేస్తామన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే పవన్…తమకు ఎవరితో పొత్తు లేదని, ప్రజలతోనే పొత్తు అని చెప్పారు..ఇటు బాబు ఏమో…వార్ వన్ సైడ్ అయిపోయిందని, నెక్స్ట్ తమదే గెలుపు అని అంటున్నారు. తాజాగా కూడా పొత్తు గురించి ఇప్పుడే మాట్లాడనని చెప్పేశారు.

అంటే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికే పవన్, బాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సింగిల్ గానే బలపడి…ఎన్నికల నాటికి పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ పొత్తు ఇప్పుడు లేదన్నట్లే చర్చ రావాలన్నట్లు వారు క్రియేట్ చేస్తున్నారు. అంటే వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో బాబు-పవన్ ఇలా వ్యూహాత్మకంగా వెళుతున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest