తాజా ఘటనతో ‘బాలయ్య అంటే అంతేమరి.. బోళా శంకరుడు’ అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు?

బాలయ్య గురించి ప్రత్యేకించి ప్రరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ఒకరు. అభిమానులు ఆయన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. అభిమానులు ఆయన తిట్టినా, కోప్పడినా, ఆఖరికి కొట్టినా కూడా ఎంజాయ్ చేస్తారు. ఆయ‌న ఎంత సీరియ‌స్ గా మంద‌లించినా కూడా వారు దాన్ని దీవెనలాగే చూస్తారు. కానీ అభిమానులను బాలయ్య ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకునే తీరు ప్ర‌తీ ఒక్క‌రికీ ముచ్చ‌టేస్తుంది. బాల‌య్య గురించి ఇండ‌స్ట్రీలో ఎవ‌రిని క‌దిలించిన వినిపించే మాట‌లివి. అయితే అభిమానులు మాత్రం కొట్టినా.. పెట్టినా.. మా బాల‌య్యే అంటున్నారు.

అవును.. “ఆయ‌న త‌ట్టినా ప‌డ‌తాం.. వెంట‌ప‌డి కొట్టినా ప‌డ‌తాం” అని బాల‌య్య అభిమానులు చాలా సంద‌ర్భాల్లో నిరూపించారు కూడా. అయితే తాజా బాల‌య్య చేసిన ఓ ప‌ని ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డ‌మే కాకుండా అభిమానుల్లో నూత‌నోత్తేజాన్ని, ఆనందాన్ని నింపుతోంది. వివ‌రాల్లోకి వెళితే.. త‌న‌ని అబిమానించే అభిమానుల‌పై ప్రేమ‌ని కురిపిస్తున్నాడు. వాళ్ల‌తో కుటుంబంలోని సభ్యుడిలాగే క‌లిసిపోతున్నారు. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ ఓ అభిమాని ఇంటికి వెళ్లి ఏకంగా అత‌ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

అదే సమయంలో తింటూనే వారితో ఆప్యాయంగా మ‌న‌సు విప్పి మాట్లాడారు బాలయ్య. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోపై అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మా బాల‌య్య మ‌న‌సు బంగారం అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. బాల‌య్య‌ది స్వ‌స్ఛ‌మైన మ‌న‌సు అని నెట్టింట సంబ‌రాలు చేసుకుంటున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 107వ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్నూలులోజ‌రుగుతోంది. క‌ర్నూలులోని ఓ హోట‌ల్ కు త‌న అభిమాన సంఘం ఆధోని అధ్య‌క్షుడు స‌జ్జాద్ జ్ఞుస్సేన్ కుటుంబాన్ని బాల‌య్య క‌ర్నూలు పిలిపించుకున్నారు. అత‌ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు.

Share post:

Latest