వైసీపీలో పక్క చూపులు చూస్తోంది వీళ్లేనా..?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను ఓడించాలని .. ఓవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో టిడిపిలో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అధికార పార్టీలో లోడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ఎలాంటి పదవులు లేక తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. జగన్ ఎప్పటికప్పుడు ఏదో ఒక నామినేటెడ్ పదవుల తో పాటు కీలక నేతలకు పదవులు కట్టబెడుతూ వస్తున్నా ఇక్కడ నేతల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో పదవులు రాని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఎలాంటి పదవులు రాని నాయకులంతా వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగానే ఇతర పార్టీ లోకి జంప్ చేసేందుకు కాచుకొని వున్నారు.

మరోవైపు వైసీపీ ఇప్పటివరకు అప్రతిహిత విజయాలతో బలంగా కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చాలా నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికలలో సీట్లు త్యాగం చేసిన వారికి జగన్ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో జగన్ తో అవసరమైతే ఢీ అంటే ఢీ అనడానికి కూడా భయపడని పరిస్థితి . మరోవైపు ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు గా ఉన్నవారు మంత్రి పదవులు కోల్పోయిన వారిలో కొందరికి.. వచ్చే ఎన్నికలలో జగన్ టికెట్లు ఇవ్వరనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో వారంతా ఎన్నికలకు ముందుగానే వైసీపీకి గుడ్బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కొందరు సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల నాటికి టిక్కెట్లు దక్కకపోతే ఆ పార్టీలో ఉండమంటున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ ను కూడా నియమించారని టాక్.

కోస్తాంధ్రలో వైసీపీ కి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్. ఈ ఇద్దరు ఎంపీలు కూడా ప్రధాన సామాజిక రెడ్డి వర్గాలకు చెందిన వారే కావడం విశేషం. నరసాపురం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తోపాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇద్దరు పేర్లు కూడా జంపింగ్ జాబితాలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అదను చూసుకుని తిరిగి టీడీపీలోకి జంప్ కొడతారని అంటున్నారు. మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు సైతం ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మరో పార్టీలో చేరతారాన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ముందు టిడిపి ,జనసేన , బీజేపీ ఇలా 3 ఆప్షన్లు కనిపిస్తుండడంతో తో ఏ పార్టీలోకి వెళ్తారన్నది సస్పెన్స్ గా మిగిలిపోయింది.

ఎమ్మెల్యేల విషయానికొస్తే మాజీ మంత్రులు మానుగుంట మహీధర్ రెడ్డి , ఆరామ రామనారాయణ రెడ్డి కూడా టిడిపిలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో వీరికి మంత్రి పదవులు రాకపోవడంతో వీరు పక్కచూపులు చూస్తున్న టాక్. అలాగే రాయలసీమలో మరో ఇద్దరి ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలతోపాటు మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేల చూపుల సైతం ఇప్పుడు టిడిపి వైపు ఉన్నట్లు తెలుస్తోంది. వైసిపి లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు చంద్రబాబు కాచుకుని ఉన్నారు. ఏది ఏమైనా ఎన్నికల ఏడాది ముందు వున్న అప్పటి నుంచి వైసీపీ నుంచి ప్రారంభం అవుతాయి వలసలు ప్రారంభమవుతాయన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Share post:

Popular