3 ఏళ్ల పాల‌న‌లో మ‌హిళ‌ల‌ను తిప్పేసిన జ‌గ‌న్‌… మామూలు స్కెచ్ కాదుగా…!

ఏపీ సీఎం.. వైసీపీ అదినేత జ‌గ‌న్ వ్యూహం అదిరింది. మూడేళ్ల ఆయ‌న పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చార‌నేది వాస్త‌వం. ఈ మూడేళ్ల‌లో ఎన్ని ఇబ్బందులు వున్నా.. ఎన్ని లోపాలుఉన్నా.. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా..వాటిని ప‌క్క‌న పెట్టి చూస్తే.. మ‌హిళ‌ల‌కు.. ఈ దేశంలో ఎక్క‌డా ల‌భించ‌ని.. ప‌ద‌వులు.. ఇవ్వ‌ని గౌర‌వాలు.. ఏపీలోనే ద‌క్కాయ‌ని.. ప్ర‌తిప‌క్షాలు సైతం అంత‌ర్గత స‌మావేశాల్లో అంగీక‌రించిన విష‌యం. అంతేకాదు.. వారికి ఇవ్వాల‌ని అనుకున్నా.. మ‌హిళా కేడ‌ర్‌లేక‌పోవ‌డం.. పెద్ద మైన‌స్‌

అంటే.. జ‌గ‌న్ పార్టీలో మ‌హిళ‌ల‌కు ప్రోత్సాహం ఓ రేంజ్‌లో ఉంద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న వాస్తవం. ఎందుకంటే.. జ‌గ‌న్ ఏం చేసినా.. రాజ‌కీయంగా ముందుముందు.. ప‌స ఉండే ప‌నే చేస్తార‌నే పేరుంది. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. గ‌తంలో ఎన్ని ప్ర‌భుత్వాలు ఉన్న‌ప్ప‌టికీ.. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. చెప్పేవారు త‌ప్ప‌.. ప‌ద‌వుల విష‌యానికి వ‌స్తే.. ప్రాధాన్యం ఉండేది కాదు. ఇచ్చినా మొక్కుబ‌డి ప‌ద‌వులు మాత్ర‌మే ఇచ్చేవారు.

కానీ, రాష్ట్రంలో 52 శాతం ఉన్న మ‌హిళ‌ల ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనేందుకు జ‌గ‌న్ ఈ మూడేళ్ల‌లో అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం నుంచి సామాజిక కార్పొరేష‌న్లు.. మునిసిపాలిటీల్లో చైర్ ప‌ర్స‌న్‌లు.. కార్పొరేష‌న్ల‌లో మేయ‌ర్లు.. ఇలా ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ మ‌హిళా ప‌క్ష‌పాతిగానే పేరు తెచ్చుకున్నారు.ఇ క‌, సామాజికంగా చూసుకుంటే.. పాల‌న‌లోనూ ఆయ‌న మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

ల‌బ్ధి దారులైన కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌కు ఇంటి ప‌ట్టా ఇచ్చారు. దీనికి కేంద్రం నుంచి కూడా అభినంద న వ‌చ్చింది. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల పేరుతో రిజిస్ట్రేష‌న్ చేస్తే.. చార్జీలు త‌గ్గించ‌డం.. కూడా కలిసి వ‌చ్చిన ప‌రిణామం. అంతేకాదు.. ఎన్నిక‌ల్లో టిక‌ట్లు కూడా వారికే ఎక్కువ సంఖ్య‌లో ఇచ్చే సూచ‌న‌లు కూడా పంపించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఎంత మ‌హిళా ప‌క్ష‌పాతో అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎవ‌రు ఏం చేసినా.. ఎన్నిక‌లే కీల‌కం కాబ‌ట్టి.. మ‌రి మ‌హిళ‌లు.. జ‌గ‌న్‌ను మ‌రోసారి అంద‌లం ఎక్కిస్తారో లేదో చూడాలి.

Share post:

Popular