రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. మారిపోయిన ఎన్టీఆర్ సినిమాలు..!

అన్న‌గారు ఎన్టీఆర్ అనేక సినిమాలు న‌టించారు. పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల‌కు.. ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఎన్టీవోడు ఉన్నాడంటే..చాలు… ఆ సినిమా ఏడాది ఖాయం! అనే మాట వ‌చ్చేది. అలాంటి ఎన్టీఆర్‌.. తెలు గు రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నాటికి ఇంచు మించు ఆయ‌న వ‌య‌సు 50 ఏళ్లు. వ‌చ్చీ రావ‌డంతోనే.. ఆయ‌న‌.. అధికారంలోకి వ‌చ్చేశారు. అయితే.. ఎంత అధికారంలోకి వ‌చ్చినా.. ఆయ‌న మ‌న‌సు మాత్రం సినిమాల‌పై ఉండేది.

దీంతో ఎంత బిజీగా ఉన్నప్ప‌టికీ.. త‌న ద‌గ్గ‌ర‌కే ర‌చ‌యితల‌ను పిలిపించుకుని.. ద‌ర్శ‌కుల‌ను పిలిపించి.. స్టోరీపై డిస్క‌స్ చేసేవారు. స‌మయం చూసుకుని షూటింగులకు వెళ్లేవారు.. అన్న‌గారు సీఎంగా ఉన్న‌ప్పు డు.. ఎక్కువ‌గా.. ఇన్‌డోర్ షూటింగుల‌కే వెళ్లేవారు. అయితే.. ఇలా.. ఒక‌టి రెండు సాంఘిక సినిమాలు తీసిన త‌ర్వాత‌.. ఎన్టీఆర్ గురించి.. అప్ప‌టి ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌లో వ్యాసం వ‌చ్చింది.. ముఖ్య‌మంత్రి అయి ఉండి.. ఇలాంటి సినిమాలు చేయ‌డం ఏంటి? అని ఈ వ్యాసంలో ప్ర‌శ్న వ‌చ్చింది.

ఇది అన్న‌గారి దృష్టిలో పడి.. తీవ్రంగా ఆలోచ‌న కు గురి చేసింది. నిజ‌మే.. ఎన్టీఆర్ అంటే… అప్ప‌టి వ‌ర‌కు ఒక న‌టుడు మాత్ర‌మే.. కానీ.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి.. సో.. ఈ హోదాకు త‌గిన విధంగా సినిమాలు ఉండా ల‌ని నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న సామాజిక సందేశం ఉన్న సినిమాల‌ను మాత్ర మే చేయాలని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోఅనేక సామాజిక కోణాల‌ను స్పృశిస్తూ.. సినిమాలు చేశారు. ఇవి కూడా అంతే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి.

అయితే.. సీఎంగా ఆయ‌న వేసిన అడుగులు.. అదేస‌మయంలో తీసిన సినిమాలు.. కూడా ఆయ‌నకు మంచి పేరు తెచ్చాయి. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు… ఎలాంటి సినిమాలు చేసినా.. ఆయ‌న ను హీరోగా చూసిన ప్ర‌జ‌లు.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌.. ఆయ‌న‌ను హీరోగానే కాకుండా.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కూడా చూడ‌డం ప్రారంభించారు. దీంతో త‌న వ్య‌వ‌హార శైలిని పూర్తిగా మార్చుకోక త‌ప్ప‌లేద‌ని.. ప‌లుసంద‌ర్భాల్లో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.