సిగ్గు ని వదిలేస్తున్న స్టార్ హీరోలు.. ఇన్నాళ్ళు గుర్తురాలేదా ఫ్యాన్స్..?

యస్..ఇప్పుడు ఇదే అంశం నెట్టింట మారు మ్రోగిపోతుంది. జనరల్ గా హీరోలు అంటే స్టైల్ మెయిన్ టైన్ చేస్తూ.. ఇస్త్రి చొక్క నలగకుండా..స్పెషల్ సీట్ లో కూర్చోని..తమ టైం వచ్చినప్పుడు స్టేజి పైకి ఎక్కి నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోతారు. మిగతాదంత ఫ్యాన్స్ చూసుకుంటారు. హీరో గారు..”మీ రుణం నేను తీర్చుకోలేనిది ..మీ అభిమానం వెల కట్టలేనిది”అంటే చాలు కోటి రూపాయలు దొరికినంత హ్యాపీగా ఫీల్ అవుతారు అమాయకపు ఫ్యాన్స్. ఈ తంతూ ఇండస్ట్రీలో కొంత కాలంగా జరుగుతూనే ఉంది.

ఆ హీరో, ఈ హీరో కాదు..అందరు హీరోలు ఇలానే ఉన్నారు. ఎవరో తారక్ లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు హీరోలు అభిమానుల గురించి ఆలోచిస్తున్నారు తప్పిస్తే..మిగతాదంత సేమ్ టు సేమ్ బ్యాచ్. అయితే, కరోనా తరువాత ఇండస్ట్రీలో లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు స్టార్ హీరో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చిన్న హీరో సినిమాలు హిట్ అవుతున్నాయి. పైగా జనాలు కూడా సినిమా బాగోలేదు అంటే ఫేస్ మీదనే చెప్పేస్తున్నారు . ఈ క్రమంలో స్టార్ హీరోలు అభిమానులను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు.

మొన్నటికి మొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు చెయ్యని విధంగా..సర్కారు వారి పాట సక్సెస్ మీట్ లో డ్యాన్స్ చేశారు. దీంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఇక ఆ తరువాత మహేశ్ ఫార్ములాని వాడుతూ..F3 సినిమా వాళ్లు కూడా సక్సెస్ మీట్ లో ఆడి పాడి చిందులేశారు. ఏకంగా సీనియర్ హీరో వెంకటేష్, వరుణ్ తేజ్..డైరెక్టర్ అనిల్ కూడా కాళ్లు కదిపారు. దీంతో సినిమాకి మరింత పబ్లిసిటి వచ్చిన్నట్లైంది. ఎందుకయ్యా..స్టేజీ పై డ్యాన్స్ చేసారు అంటే..సినిమా హిట్ చేసినందుకు..అభిమానులకు సర్ప్రైజ్ అంటారు. మరి ఇన్నాళ్లు ఏమైపోయింది ఆ సర్ ప్రైజ్..అనేది సినీ విశ్లేషకుల ప్రశ్న. మరి దీనికి మన స్టార్ హీరో ఆన్సర్ ఇస్తారంటారా..?

Share post:

Popular