ప్రకాష్ రాజ్-మంచు విష్ణులను కలిపింది ఆ హీరోనేనా..ఇదేం ట్వీస్ట్ రా బాబు ..!

సినీ ఇండస్ట్రీలో అంటే ఓ రంగుల ప్రపంచం..ఓ మాయ లోకం..ఇక్కడ ఏమైన జరగచ్చు..అని అంటుంటారు సినీ ప్రముఖులు. బహుశా ఇది చూస్తే నిజమే కాబోలు అనిపిస్తుంది. లేకపోతే..నిన్న మొన్నటి వరకు తిట్టిన తిట్టులు..తిట్టుకోకుండా తిట్టుకుని..నానా రచ్చ చేసి..తీర అంతా అయిపోయాక..కూల్ అయిపోయి సరదాగా మాట్లాడుకునే స్దాయికి వచ్చేశారు మా ప్రెసిడేంట్ ..మంచి విష్ణు..ప్రకాష్ రాజ్.

మనకు తెలిసిందే..మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్- మంచి విష్ణు మధ్య ఎలాంటి రసవత్తర పోరు సాగిందో. వామ్మో, అసెంబ్లీ ఎన్నికలకన్నా దారుణంగా..మాట్లాడుకున్నారు, అరుచుకున్నారు..స్ట్రాటజీలు వేసుకున్నారు. ఇక పోలింగ్ నాడు జరిగిన సంగతులు గురించి చెప్పనవసరం లేదు. ఏకంగా కోరుకునేసారు ప్యానల్ సభ్యులల్లో ఒకరు. అంత దారుణంగా జరిగిన పోలింగ్ మధ్య..ఫైనల్ గా ప్రకాష్ రాజ్ పై మంచి విష్ణు భారీ మెజారిటీ తో విన్ అయ్యాడు.

సీన్ కట్ చేస్తే..అప్పటి నుండి ప్రకాష్ రాజ్ బయట పెద్దగా కనిపించలేదు. అయితే రీసెంట్ గా..యాక్షన్‌ హీరో అర్జున్‌ సర్జా దర్శకత్వంలో యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లు రాబోతున్న సినిమా పూజా కార్యక్రమంలో మెరిసారు ప్రకాష్ రాజ్. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. అయితే, ఇదే పూజా కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ మ్మచి విష్ణు కూడా హాజరయ్యారు. దీంతో అక్కడ మరో వార్ జరుగుతుంది అనుకున్నారంతా..కానీ, వాళు ఈద్దరు చాలా సరదాగా..ముచ్చటించుకోవడం అందరికి ఆశ్చర్యాని కలిగిస్తుంది. అయితే, ఇలా ప్రకాష్ రాజ్-విష్ణు ని కలిపించి ఓ హీరో అని.. ఇండస్ట్రీ మనం మనం ఒక్కటిగా ఉండాలి..గతం గతః ..బీ ఫ్రెండ్లీ అంటూ వీళ్లని కలిసేలా చేశారట. అయితే, సోషల్ మీడియాలో మాత్రం..వీళ్ల గురించిన వార్తలు ఇంకా వైరల్ గానే మారుతున్నాయి. ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్- మంచు విష్ణు మాట్లాడుతున్న పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి చూడాలి రానున్న రోజుల్లో వీళ్ళిద్దరి కలిసి నటించిన ఆశ్చర్య పోనవసరంలేదు..!!