మెగా ఫ్యామిలీ VS బ‌న్నీ… వైర‌ల్ అవుతోన్న ఏమి పీకలేరు బ్ర‌ద‌ర్‌..!

గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ సినిమా వేదిక మీద చేసిన కామెంట్ ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ తనకు సంబంధం లేని ఒక స్టేజి పైన ఆయన పేరు పలకమన్నందుకు బన్నీ ఈ విధంగా స్పందించారు. దీని పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక అది గుర్తుపెట్టుకుని మెగా అభిమానులు అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా సమయంలో అంతగా ట్రోల్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు.

అంతేకాదు ఆ సినిమాకు సంబంధించి ఏ కంటెంట్ వచ్చినా కూడా పనికట్టుకుని మరి డిస్ లైక్ చేస్తూ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు మెగా అభిమానులు. ఇక ఎంతలా అంటే డిస్ లైక్స్ తోనే టీజర్, ట్రైలర్లను రికార్డుల్లోకెక్కించారు అంటే ఇక అర్థంచేసుకోవచ్చు మెగా అభిమానులకు అల్లు అర్జున్ అంటే ఎంత కోపమో. ఇకపోతే మెగా ఫ్యామిలీ అండతో.. మెగా అభిమానుల ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చిన అల్లుఅర్జున్ కనీసం వాళ్ళ పేరును ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటూ అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు.ఇక అప్పుడే బన్నీ ఫ్యాన్స్ అంటూ సపరేట్ గా మరో గ్రూపు కూడా బయటకు వచ్చింది. ఇదంతా ఎప్పుడో జరిగిపోయిన ముచ్చట.

కానీ పవన్ కళ్యాణ్ తో బన్నీ కలవడం.. ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు తెలపడం.. ఒకరికొకరు హగ్ చేసుకోవడం అన్ని జరిగిపోయాయి. ఇదిలా వుండగా తాజాగా ఆలిండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన స్వామి నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక అందులో జనసేన అధినేత గెలుపు కోసం కృషి చేయాలి అని ఎవరితో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పవన్ వెంటే నడవాలి అని తీర్మానించడం జరిగింది.

ఇదంతా బాగున్నప్పటికీ ఆ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏమిటంటే చిరంజీవి , రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ , నాగబాబు ఉన్న ఒక బ్యానర్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అందులో అల్లు అర్జున్ కి స్థానం కల్పించకపోవడమే.. మెగా హీరోల జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొనడానికి ఇది కావాలనే మెగా అభిమానులు తీసుకున్న నిర్ణయమని అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ రాష్ట్ర యువత అధ్యక్షుడు భవాని రవి కుమార్ స్పష్టం చేశారు. ఇక చెప్పను బ్రదర్.. ఇవ్వను బ్రదర్ అని ఇలా పరోక్షంగా బన్నీ ని దూరం పెట్టేశారు మెగా అభిమానులు.