విజ‌య‌వాడ వైసీపీ టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉందా….?

రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజ‌య‌వాడ న‌గ‌రం కీల‌కం. ఇక్క‌డ ప‌ట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్క‌డైనా వాయిస్ వినిపించ‌వ‌చ్చ‌నే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్ర‌స్తుతం వైసీపీకి ఇక్క‌డ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఉన్న భ‌రోసా..సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై లేదు. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు ఉన్నారు.

అయితే.. ఆయ‌న ప‌నితీరు బాగోలేద‌ని. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నేత బొండా ఉమా గెలుపు ఖాయ‌మ‌ని.. వైసీపీకి ఇప్ప‌టికే పీకే నివేదిక స్ప‌ష్టం చేసింది. ప్ర‌జ‌ల్లో ఉండాల్సిన ఎమ్మెల్యే.. కేవ‌లం కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారని, మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క పోవ‌డం తో ఆయ‌న మ‌రింత దూరం అయ్యార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మార్పులు ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

దీంతో ఈ టికెట్‌ను ద‌క్కించుకునేందుకు వైసీపీలో కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. వీటిక‌న్నాముఖ్యంగా విజ‌యవాడ ఎంపీ టికెట్‌ను వైసీపీ అధిష్టానం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వ‌చ్చే సారి ఇక్క‌డ గెలిచి తీరాల‌ని.. భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో బ‌ల‌మైన నాయ‌కుడి కోసం అధిష్టానం.. ఇటు పార్టీ వ‌ర్గాలు కూడా చూస్తున్నాయి. గ‌తంలో ఇక్క‌డ నుంచి పీవీపి పోటీ చేసి ఓడ‌డిపోయారు. అయితే.. ఆయ‌న అప్ప‌టి నుంచి ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. ఇక్క‌డ నుంచి మాజీ ఎంపీ.. ల‌గ‌డ పాటి రాజ‌గోపాల్‌ను రంగంలోకి దించితే.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని వైసీపీలోకి క‌మ్మ సామాజిక వర్గం లెక్క‌లు వేస్తోంది. ఆదిశ‌గా ఇప్ప‌టికే.. అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే.. రాజ‌గోపాల్ వ‌స్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ఆయ‌న కాదంటే.. సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుడికి ఇక్క‌డ అవ‌కాశం ఇచ్చేఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఈ ద‌శ‌లో.. ఒక‌రిద్ద‌రి పేర్లు కూడా హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.