‘RRR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పెద్దాయన..రాజమౌళి గూబ గుయ్యమనిపించాడుగా..?

రాజమౌళి..టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. దర్శకధీరుడు అనే బిరుదు కూడా ఇచ్చారు అభిమానులు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అన్ని సినిమాలు కూడా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ సాధించాయి. ముఖ్యంగా ఆయన పేరును ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన సినిమా మాత్రం బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ జాతకానే మార్చేశాడు. సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఆయన రేంజ్ మారలేదు అంటే కారణం బాహుబలి చూపించిన మార్క్. ప్రభాస్ ని ఇప్పటికి అభిమానులు అమరేంద్ర బాహుబలి గానే చూస్తున్నారు.

కాగా , ప్రజెంట్ జక్కన్న చరణ్-తారక్ తో కలిసి..ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా..మార్చి 25న విడుదలకు సిద్ధమౌతుంది. అభిమానులు తో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో 9 రోజుల్లో సినిమా మనముందుకు రాబోతుంది. ఈ క్రమంలో రాజమౌళి ప్రమోషన్స్ పనులు స్పీడ్ అప్ చేశాదు.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. మొదట్లో వేరే దేశంలో పెట్టుకుంటారు ప్రి రిలీజ్ ఈవెంట్ ని అని పలు వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఫైనల్ గా ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బెంగళూరులో జరగనుంది. ఈ నెల 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రిరిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరగనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ ఈవెంట్‌ కి చీఫ్ గెస్ట్ గా ఏ బడా హీరో వస్తారా అని అనుకున్న ఫ్యాన్స్ కి షాకిస్తూ.. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై ను ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడట రాజమౌళి. ‘RRR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సీఎం రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో నెట్టింట ట్రోల్స్ ఊప్పందుకున్నాయి. ఒకడు ఏమో బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వస్తాడు అంటాడు..మరోకడు ఏమో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నాడు అన్నాడు..చివరికి అందరికి గూబ గుయ్యమనిపించి ..సీఎం ని ఫిక్స్ చేశాడు రాజమౌళి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్..!! మరి దీని పై అఫిషీయల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..!!

Share post:

Popular