షన్నూ.. అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో సమానంగా ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్..దేవుడిచ్చిన టాలెంట్..ప్రతి క్షణం నేను ఉన్నా నీ వెంట అంటూ వెనకే ఉండి నడిపే ఫ్రెండ్స్..ఆయన సోంతం. షన్నూ గురించి చెప్పుకోవాలంటే బిగ్ బాస్ ముందు..బిగ్ బాస్ తరువాత అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన జీవితంలో..బిగ్ బాస్ మేజర్ రోల్ ప్లే చేసింది.
బిగ్ బాస్ అందరికి తమ పాపులారిటినీ పెంచుకునేలా చేస్తే..షన్నూ కి మాత్రం ఉన్న పరువు పోయేలా చేసింది. అది షన్నూ చేసిన తప్పా..లేక అక్కడ తప్పు జరగకపోయినా..తప్పు జరిగింది అనేలా చూయించిన బిగ్ బాస్ షో తప్పా అని ఎవ్వరికి అర్ధంకావడంలేదు. ఏది ఏమైతేనేం ప్రాణంగా ప్రేమించుకున్న జంటను బిగ్ బాస్ విడకొట్టింది. ఇప్పుడు వాళ్లు వాళ్ళ పరసనల్ లైఫ్ కెరీర్ పై దృష్టి పెట్టారు..దానికి సంతోషమే అంటున్నారు అభిమానులు.
అయితే దీప్తీ బ్రేకప్ అయిన తరువాత చాలా రోజులు షన్నూ సైలెంట్ అయిపోయాడు. దీంతో షన్నూ మరో దేవదాసులా మారిపోతున్నాడా అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ట్రోల్స్ చూసి యాక్టీవ్ అయ్యాడో లేక లైఫ్ లో దీపు ఒక్కటే కాదు అనుకున్నాడో తెలియదు కానీ..కుర్రాడి మంచి స్పీడ్ మీద ఉన్నాడు. ఈ మధ్యనే తన ఫేవరేట్ హీరో సూర్యని కలిసిన ఫోటో వీడియోలు అభిమానులతో పంచుకున్న ఆయన..రీసెంట్ గా హీరోయిన్ తో డ్యాన్స్ చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేశాడు. అసలే ఇప్పుడు ఇన్ స్టా రీల్ ట్రెండింగ్ వీడియో మొత్తం హళమితి హబిబో అంటూ బీస్ట్ మోడ్లో స్టెప్పులు వేస్తున్నారు. ఆ పాటకే హీరోయిన్ నువేక్షతో కలిసి షన్ను వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. చాలా రోజుల తరువాత షన్నూ డ్యాన్స్ చూసిన ఆయన అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. షన్నూ ఇది నువ్వేనా..చాలా బాగున్నవ్..ఇలాగే ఉండూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.