సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌.. ప‌క్కా ప్లాన్‌తోనే జ‌రుగుతోందా…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. ఈ విష‌యంలో ఎలాంటి తేడా లేదు. ఇటీవ‌ల నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పార్టీకి ప్ర‌ధాన వెన్నెముక‌గా ఉన్న జ‌గ‌న్‌ను త‌ప్పిస్తే.. ఇక‌, వైసీపీ ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కీల‌క పాత్ర పోషించ‌నుంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ఏం చెప్పినా.. ప్ర‌జ‌లు.. పార్టీ నాయ‌కులు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలోనే వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్‌ను ముందుకు తీసుకువ‌చ్చే ప్లాన్ ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు.

ఇక్కడ ఒక కీల‌క విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. గ‌తంలో ఎన్న‌డూ కూడా.. ప‌వ‌న్ ఇంత భ‌రోసాగా.. వ‌చ్చే ఎన్నిక ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తాం.. వ‌స్తాం.. వైసీపీ కొమ్ములు విరిచేస్తాం.. వంటి కామెంట్లు చేయ‌లేదు. కానీ.. తాజాగా ఆయ‌న చాలా ఆత్మ విశ్వాసంతో ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని.. మేధావులు చెబుతున్నా రు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా..(జ‌న‌సేన త‌ర‌ఫున ఎంతమంది గెలిచినా) ప‌వ‌న్ ను ప్రొజెక్టు చేయాల‌ని.. వ్యూహం రెడీ అయిన‌ట్టు మేధావులు అనుమానిస్తున్నారు.

ఎందుకంటే.. చంద్ర‌బాబు ఏం చెప్పినా.. ఏం చేసినా.. ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ఏమేర‌కు విశ్వ‌సిస్తార‌నేది సందేహంగానే ఉంది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో అవినీతి ర‌హిత పాల‌న‌, పేద‌ల‌కు సంక్షేమం.. వంటి వాటిపై ప‌వ‌న్‌తో వ్యాఖ్య‌లు చేయించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే అవ‌కాశం మెండుగా ఉంటుంది. త‌ద్వారా.. ప్ర‌జ‌లు కూడా ప‌వ న్‌పై ఉన్న విశ్వ‌స‌నీయ‌త‌తో ఆయ‌న వెంట న‌డిచినా న‌డిచే ఛాన్స్ ఉంద‌ని మేధావులు చెబుతున్నారు. పైగా.. ప‌వ‌న్ కూడా ఒక్క ఛాన్స్ అంటూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

త‌ద్వారా.. టీడీపీ-జ‌నసేన పొత్తు చిగురించి.. అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉందని.. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్రొజెక్టు చేయ‌డం ద్వారా.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుతోపాటు.. సానుభూతి ప‌రుల ఓటు మార్పు కోరుకునేవారి ఓటును ఇలా.. అన్ని వ‌ర్గాల ఓటును వైసీపీకి దూరం చేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.