టాలీవుడ్లో ‘వంద’కు జై కొడుతున్న స్టార్ హీరోలు ..కారణం తెలుసా ?

వందకు ఉన్న విలువ మిగతా పదాలలో దేనికి ఉండదు .సంస్కృతంలో శతమా అన్న ,తెలుగులో నూరు అన్న అదే వందనే . సినిమా రంగంలో కూడా వందకు ఉన్న విలువ దేనికి లేదని చెప్పొచ్చు .ఒకోప్పడు వందరోజులు ఆడిన సినిమా అంటే హిట్ సినిమాగా లెక్కేసేవారు .ఆ తరువాతగా వంద సెంటర్లో శత దినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అనే వారు .మరి ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తే ఆ సినిమాను సూపర్ డూపర్ హిట్ అంటున్నారు .వాటికి ఇప్పుడు క్లబ్లు పెట్టేసారు .అన్ని దాటుకుని కొందరు హీరోలు ఏకముగా వంద కోట్లు అందుకోబోతున్నారని అనే మాట వింటే ఆశ్చర్యం ,ఆసక్తి కలగగబోదు .వసూళ్లు పరంగా ,మార్కెట్ పరంగా బాలీవుడ్ సినిమాలకు సవాలు విసీరుతున్నాయి టాలీవుడ్ సినిమాలు .

గతంలో ఏ ప్రాతీయ సినిమాలు ఈ స్థాయిలో ఈ రకంగా విజయం సాధించిన సందర్భాలు లేవు .ఈ నేపథ్యంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ తో టాలీవుడ్ సూపర్ స్టార్స్ పోటీపడుతున్నారు .బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ,అమిర్ ఖాన్ ,షారుక్ ఖాన్ ,అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఇదొక రూపంలో సినిమాకు వందకోట్లు పుచ్చుకుంటున్నారు .ఇప్పుడు టాలీవులో ప్రభాస్ కూడా వంద కోట్లు తీసుకుంటున్నాడని ఇండస్ట్రీలో ,బాలీవుడ్ లో టాక్ .ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్ ‘కోసం అయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ అక్షరాలా వంద కోట్లు .అలాగే అర్జున్ రెడ్డి రీమేక్ తో ఇక్కడ కబీర్ సింగ్ హిట్తో పేరు సంపాదించినా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్ ‘ సినిమాకు కూడా ప్రభాస్ వంద కోట్లు అందుకోబోతున్నారంట .

ఈ స్పిరిట్ కధ మొదట రామ్ చరణ్ ,మహేష్ బాబు ల దగ్గరుకు వెళ్లిందట,అయితే వాళ్లకు కధ నచ్చకపోవటం తో ఆది ప్రభాస్ దగ్గరికి వచ్చిందంట.ఈ సినిమాకు ప్రభాస్ దాదాపు 150 కోట్లు డిమాండ్ చేస్తునంట్టు టాలీవుడ్లో టాక్ .ప్రభాస్ కధ అలాగుంటే అల్లు అర్జున్ పుష్ప 2 తరువాత నటించపోయే సినిమాలకు వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాడంట.అట్లై తో లైకా ప్రొడక్షన్ లో చేస్తున్న పాన్ ఇండియా సినిమాకు కూడా వంద కోట్లు అడుగుతునంటూ టాక్ .గత సినిమా వరకు 80 కోట్లు తీసుకొనే విజయ్ కూడా ఇప్పుడు వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాడట .ఇలా ఒకొక స్టార్ హీరో లు వంద కోట్లు డిమాండ్ చేయడంతో వందకు జై కొడుతున్న హీరోలంటున్నారు .

Share post:

Latest