25 ఏళ్ల‌కే ప్రేమ‌లో ప‌డ్డ స్టార్ హీరో కొడుకు…. పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నాడా…!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోలు… హీరోయిన్లలో చాలామంది నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. టాలీవుడ్ హీరోలు అయితే మూడు పదుల వయసు వస్తే గాని పెళ్లి గురించి ఆసక్తి చూపటం లేదు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ముదురు ముద్దుగుమ్మలు అనుష్క – నయనతార – అంజ‌లి లాంటి వాళ్ళు మూడు పదుల వయసు దాటినా కూడా అస్సలు పెళ్లి అనే మాట కూడా ఎత్తటం లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా సైతం ఇదే బాటలో ఉంది. చాలామంది ముందుగా కెరీర్ చక్కదిద్దుకున్నాకే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు.

అయితే పాతికేళ్ళ ఒక యంగ్ హీరో మాత్రం అప్పుడే ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పైగా పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు అని మీడియా కోడై కూస్తోంది.. పైగా అతని తండ్రి కూడా ఒక స్టార్ హీరో. మరి ప్రేమలో ఉన్న ఆ యంగ్‌స్టార్ హీరో ఎవరో కాదు. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ తో హీరోగా పరిచయం అయిన ధృవ్ తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు.

కోలీవుడ్ యూత్‌లో ధృవ్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో సోలో హీరోగా మరో రెండు సినిమాల్లో నటిస్తున్న మనోడు… తండ్రితో కూడా కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్‌ ప్రారంభంలో ఉన్న ధృవ్‌
ఇప్పుడు సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. అయితే ఇప్పుడు మ‌నోడి కాన్‌సంట్రేష‌న్ అంతా ప్రేమ పై ఉన్నట్టు తెలుస్తోంది. ధృవ్‌ భారత సంతతికి చెందిన బ్రిటన్ బ్యూటీ బ‌నిత సందుతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. బ‌నిత ఇండియన్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది.

ఈ సినిమాలో వీరిద్దరు కలిసి నటించి మెప్పించారు. సినిమా షూటింగ్ తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. ఆ స్నేహం ఇప్పుడు ప్రేమ‌గా మార‌డంతో వీరు చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. క‌నీసం ఆరేడు సినిమాలు కూడా చేయ‌కుండానే.. ధృవ్ 25 ఏళ్ల‌కే ప్రేమ‌, డేటింగ్ అంటూ టైం వేస్ట్ చేస్తున్నాడ‌ని.. ఇది కెరీర్ స్టార్టింగ్‌లోనే ధృవ్ వేస్తోన్న రాంగ్ స్టెప్ అన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి మ‌నోడు కెరీర్ ఎలా చ‌క్క‌దిద్దుకుంటాడో ? చూడాలి.

Share post:

Latest