దవడ పగిలిపోద్దని వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఎవరికో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తనదైన స్టయిల్‌లో గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘‘దొరికితే దవడ పగిలిపోద్ది’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. ఇంతకీ బాలయ్య ఈ రేంజ్‌లో మండిపడటం వెనుక అసలు కారణం ఏమిటి.. ఆయన ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చాడనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ వార్నింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో బాలయ్య ఎనర్జీకి అందరూ ఫిదా అవుతున్నారు.

ఇక ఇటీవల వరుసగా స్టార్ గెస్ట్‌లను ఈ షోకు ఆహ్వానిస్తూ అన్‌స్టాపబుల్ టాక్ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడు బాలయ్య. అయితే ఇటీవల ఈ టాక్ షోలో పాల్గొన్న కొందరు సెలెబ్రిటీలు బాలయ్యతో తమకు వైరం ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మాట్లాడారు. దీనికి బాలయ్య తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి కారుకూతలు కూస్తున్న వారందరికీ హోల్‌సేల్‌గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రవితేజతో బాలయ్యకు గొడవ జరిగిందని.. బాలయ్య-చిరంజీవిలు ఫోన్‌లో మాట్లాడుకోరని.. నా హీరో తోపు నీ హీరో సూపు.. ఇలా సోషల్ మీడియాల ఇర్రెస్పాన్సిబుల్‌గా వార్తలు రాసే వారందరినీ బాలయ్య గట్టిగా ఏసుకున్నాడు.

‘‘ఇలా తప్పుడు వార్తలు రాసి పబ్బం గడుపుకునే వారికి ఇదే నా వార్నింగ్ అంటూ… లెఫ్ట్ హ్యాండ్ కూడా బాగయ్యింది.. దొరికితే దవడ పగిలిపోద్ది’’ అంటూ బాలయ్య ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇటీవల ఆయన ఎడుమ భుజానికి సర్జరీ కావడంతో ఒక చేతికి పట్టి వేసుకుని మరీ ఈ టాక్ షోను హోస్ట్ చేశాడు బాలయ్య. ఇప్పుడు రెండు చేతులూ బాగున్నాయని, ఇలా తప్పుడు వార్తలు రాసే వారికి బాలయ్య ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్‌తో ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బాలయ్య ఏది చేసినా కరెక్ట్ అంటూ వారు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Share post:

Latest