సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ లో ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ.. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు అంటే కూడా అంతే ఇష్టం అని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ ఇష్టాయిష్టాలను అభిమానులు కూడా ఎంతో ఇష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ కు ఇష్టమైన ఆహారం ఏమిటో తెలుసుకోవాలి అంటూ కొంతమంది అభిమానులు నెట్లో సర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
ఒకానొక సందర్భంలో కీరవాణి ఎన్టీఆర్ ను ఒక ప్రశ్న అడిగారు.. మీకు ఇష్టమైన ఆహారం ఏమిటో తెలుసుకోవాలని మీ అభిమానులు చాలా ఆత్రుతగా చూస్తున్నారు అంటూ అడిగారు.. అందుకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాటుకోడి ని బాగా కాల్చి.. దానిచుట్టూ కారం పట్టించి.. అల్లం వెల్లుల్లి బాగా ముద్దగా కలిపి ఆ కోడికి పట్టించి.. కాసేపు దాన్ని పక్కన పెట్టి.. కాస్త నెయ్యి ఆ కోడి మీద పట్టించి, అలాగే పెరుగు, పసుపు పట్టించి.. పక్కన పెట్టి.. ఇక అలాగే మరొక చికెన్ ను కీమా చేయించి.. ఆ కీమా ని బాగా కోడి లోకి కూరి.. ఇక దానిని అలాగే మంట మీద రెండు గంటల సేపు కాల్చి.. పక్కన పెట్టుకొని.. ఒక పెద్ద రోటీని తెచ్చుకొని, ఆరోటి తోనే చికెన్ మొత్తం తినాలనిపిస్తుంది. అంటూ తెలియజేశాడు ఎన్టీఆర్.