రెబల్ స్టార్ కృష్ణంరాజు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన డార్లింగ్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అటువంటి వ్యక్తిని గొప్ప నటుడు ఏమీ కాదు అన్నదో స్టార్ హీరోయిన్.
ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, విలక్షన నటి కంగనా రనౌత్. పూరీ జగన్నాథ్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన `ఏక్ నిరంజన్` సినిమాతోనే కంగనా టాలీవుడ్‌కి పరిచయం అయింది. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కంగనా మాట్లాడుతూ.. `ఏక్ నిరంజన్ సినిమా సమయంలోనే ప్రభాస్ మొట్టమొదటిగా చూశాను. అప్పుడు ప్రభాస్ గొప్ప నటుడు ఏమీ కాదనిపించింది. కానీ కొన్నేళ్లకు విడుదలైన బాహుబలి చిత్రంలో ప్రభాస్ నటనను చూసి షాక్ అయ్యాను. ఎంతో అద్భుతంగా నటించాడు. తాను అసలు పాన్ ఇండియా స్టార్ అవుతాడని తను ఊహించుకోలేదు` అంటూ చెప్పుకొచ్చింది.
కాగా, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. అలాగే ప్రభాస్ మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాలును చేస్తున్నాడు. ఇవి పూర్తి అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూడు చేయనున్నాడు.