తార‌క్ చేత క‌న్నీళ్లు పెట్టించిన స‌మంత‌..కార‌ణం అదేనట‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేత స‌మంత క‌న్నీళ్లు పెట్టించిందా..? అస‌లు ఏం జ‌రిగింది..? తార‌క్ క‌న్నీళ్లు పెట్ట‌డం వెన‌క కార‌ణం ఏంటీ..? వంటి ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌కు స‌మాధానాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అసలు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. `ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన స‌మంత‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌ను మార్చుకున్న సామ్‌.. పెళ్లి, విడాకుల త‌ర్వాత కూడా త‌న ఫామ్‌ను కోల్పోకుండా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇక‌పోతే పాత్ర ఏదైనా సామ్ ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టిస్తుంది. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ చేయ‌డంలో సామ్ మ‌హా దిట్ట‌.

అలా తార‌క్‌, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన `జనతా గ్యారేజ్` సినిమాలోనూ సామ్ న‌టించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ దూరం అయ్యేట‌ప్పుడు సామ్ ఎంతో ఎమోషనల్ అవుతూ ప్రేక్ష‌కులంద‌రినీ ఏడిపించేస్తుంది. అయితే ఆ సీన్‌లో స‌మంత ఏడ‌వ‌టం చూసి ఎన్టీఆర్ కూడా ఏడ్చేశార‌ట‌. ఈ విష‌యాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ స్వ‌యంగా తెలిపారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. `సమంత తనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని.. జనతా గ్యారేజ్ సినిమాలో అద్భుతంగా నటించిందని.. అందులో ఆమె ఏడవడం మొదలు పెడితే మాత్రం తాను కూడా ఏడుస్తాను` అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, 2016లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పుడు మ‌ళ్లీ ఎన్టీఆర్ కొర‌టాల శివ కాంబో రిపీట్ అవ్వ‌బోతోంది. ఎన్టీఆర్ ఇటీవ‌లె త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల‌తో ప్ర‌క‌టించాడు. అయితే ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ సినిమాలోనూ సామ్‌నే హీరోయిన్‌గా తీసుకుంటున్నార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.