పెళ్లి పీట‌లెక్క‌బోతున్న స‌న్నీ.. అమ్మాయి ఎవ‌రో తెలిస్తే మైండ్‌బ్లాకే?

విజే స‌న్నీ.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌న్నీ.. ఓ న్యూస్ ఛానెల్‌లో కొన్నాళ్ల పాటు జర్నలిస్టుగా ప‌ని చేశాడు. ఆ త‌ర్వాత వీజేగా చాలా ఏళ్ళు కెరీర్‌ను కొన‌సాగిన ఈయ‌న ఆపై యాంక‌ర్‌గా, బుల్లితెర న‌టుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ మ‌ధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పాల్గొని.. చివ‌ర‌కు విజేతగా విజయ దుందుభి మోగించాడు.

త‌న ఆట‌తీరుతో, మాట‌తీరుతో బిగ్‌బాస్ ట్రోఫీని గెలుచుకున్న స‌న్నీ.. రూ.50 లక్షల ప్రైజ్ మనీ, పాతిక లక్షలు విలువ చేసే ఫ్లాట్ మ‌రియు అదిరిపోయే బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే.. స‌న్నీ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా స‌న్నీ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ స‌మ‌యంలో ఉష అనే మహిళా అభిమాని సన్నీకి వీడియో కాల్ చేసింద‌ట‌.

ఆమె త‌న కూతురిని వివాహం చేసుకోమ‌ని స‌న్నీని డైరెక్ట్‌గా పెళ్లి సంబంధం మాట్లాడేసింద‌ట‌. మా అమ్మాయి చాలా బాగుంటుంద‌ని, త్వ‌ర‌లోనే ఆమెరికా నుంచి ఇండియాకు వ‌స్తుంద‌ని, డీటెయిల్స్ అన్నీ పంపిస్తాన‌ని ఉష చెప్పుకొచ్చింది. అంతే కాదు, మా ఆస్తి మొత్తం రూ.100 కోట్లపైనే ఉంటుంది.. అది మొత్తం నీకే అంటూ స‌న్నీతో తెలిపింద‌ట‌.

దాంతో ఒకింత షాకైన స‌న్నీ.. `అయ్యో అంటీ నాకేమి ఆస్థి వద్దు. అయినా నన్ను భరించాలంటే.. చాలా ఓర్పు ఉండాలి.. మీరు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమ‌ని మాట అన్నారు చాలు` అంటూ సున్నితంగా మ్యాచ్‌ను రిజెక్ట్ చేశాడ‌ట‌. మొత్తానికి అమెరికా నుంచి పెళ్లి సంబంధాలు వ‌స్తున్నాయంటే బిగ్‌బాస్‌తో స‌న్నీ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది.