నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నాని ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఆయన నటించిన లాస్ట్ రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం, ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాని చూస్తున్నాడు. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తెలుగుజర్నలిస్ట్.కామ్ ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ ప్రీరివ్యూని మీకు అందిస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే(ఇలా ఉండొచ్చు)..
వాసు(నాని) ఓ పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతడు తన సాఫ్ట్వేర్ జాబ్‌ను కూడా రిజైన్ చేసి డైరెక్టర్ కావాలని చూస్తాడు. ఈ క్రమంలో అతడు డైరెక్ట్ చేయాలనుకునే సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టిని పెట్టాలనుకుంటాడు. అందుకు ఆమెను ఒప్పిస్తాడు కూడా. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ క్రమంలో షూటింగ్ పనిమీద వాసు కోల్‌కతా వెళ్లగా, అక్కడ జరిగిన కొన్ని పరిణామాల వల్ల అతడి మెదడులో శ్యామ్ సింగ రాయ్ అనే వ్యక్తికి సంబంధించిన విషయాలను అతడి కళ్ల ముందు మెదులుతుంటాయి. అసలు ఈ శ్యామ్ సింగ రాయ్ ఎవరు..? వాసుతో అతడికి ఎలాంటి కనెక్షన్ ఉంటుంది? అనేది సినిమా కథగా ఉండొచ్చు.
విశ్లేషణ(ఇలా ఉండొచ్చు):
ఈ సినిమాకు రొటీన్ కథను ఎంచుకున్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఎలా ఉందనేది ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఈ సినిమాలో వాసు అనే పాత్రలో నాని మరోసారి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా డైరెక్టర్ కావాలనే ఆశతో తన స్నేహితులతో కలిసి హీరోయిన్ కోసం వెతకడం, ఈ క్రమంలో వారికి కృతి శెట్టి కనిపించడం, ఆమెతో వాసు లవ్ ట్రాక్ ఇదంతా మనకు ఫస్టాఫ్‌లో చూపిస్తారు చిత్ర యూనిట్. ఓ పనిపై కోల్‌కతా వెళ్లిన వాసుకి అక్కడ ఓ అనుకోని సమస్య వచ్చి పడుతుంది. ఇక్కడ వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమా సెకండాఫ్‌పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
ఇక సెకండాఫ్‌లో శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నాని మనల్ని కట్టిపడేస్తాడు. కోల్‌కతాలో అన్యాయాలకు గురవుతున్న దేవదాసీలతో పాటు ప్రజలను ఆయన ఎలా కాపాడతాడు.. ఇంతకీ అక్కడ అరాచకం సృష్టిస్తుంది ఎవరు..లాంటి సీన్స్‌ను మనకు చూపించారు చిత్ర యూనిట్. ఇక ఒకట్రెండు ట్విస్టులతో వచ్చే ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తాయి. మొత్తంగా చూసుకుంటే శ్యామ్ సింగ రాయ్ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్(ఇలా ఉండొచ్చు):
వాసు, శ్యామ్ సింగ రాయ్ అనే రెండు విభిన్న పాత్రల్లో నాని పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పాలి. ఈ సినిమాలో నాని బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉండటంతో ఈ సినిమా ఆయన అభిమానులకు బాగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కృతి శెట్టి, సాయి పల్లవిల పర్ఫార్మెన్స్ సూపర్. అటు మరో భామ మడోనా సెబాస్టియన్ కూడా పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమాలో మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ డిపార్ట్మెంట్:
ఈ సినిమాకు రొటీన్ కథను రాసుకున్నా, దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. తన గత చిత్ర అనుభవంతో ఈ సినిమాను పూర్తి కాన్ఫిడెన్స్‌గా తెరకెక్కించాడు ఈ డైరెక్టర్. నటీనటుల నుండి పూర్తిగా తనకు కావాల్సినంత స్టఫ్‌ను వాడుకున్నాడు ఈ దర్శకుడు. అటు ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుజర్నలిస్ట్.కామ్