టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఏకైక తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈయన ఎంట్రీపై గత ఐదేళ్ల నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. బాలయ్య సైతం తనయుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య.. తాను నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం `ఆదిత్య 369` సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. అలాగే ఈ సీక్వెల్‌కి `ఆదిత్య 999 మాక్స్` అనే టైటిల్ ఖరారు చేశామని.. ఇందులో తాను కూడా నటిస్తున్నానని బాలయ్య తెలిపారు.
ఇక ఈ మధ్య `ఆదిత్య 369` సీక్వెల్ స్క్రిప్ట్ పూర్తైందంటూ వార్తలు బయటకు వచ్చింది. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఓ ఫొటో బటయకు వచ్చింది. ఈ ఫొటోలో మోక్షజ్ఞ జిమ్‌లో కోచ్ సమక్షంలో వర్కౌట్లు చేస్తూ రూపు రేఖలని మార్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. వెనక తనయుడిని చూస్తూ బాలయ్య కనిపించారు.
దీంతో ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ పిక్‌ను నందమూరి అభిమానులు చూసి ఎంతగానో మురిసిపోయారు. కానీ, నిజం ఏంటంటే అది ఒరిజినల్ ఫొటో కాదు. మార్ఫ్ డ్ ఫోటో. పైన ఉన్న పిక్‌ను గమనిస్తే మీకు ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మొత్తానికి మార్ఫ్ డ్ పిక్‌లో మోక్షజ్ఞను చూసి మోసపోయిన బాలయ్య ఫ్యాన్స్.. ఒరిజినల్ పిక్ చూసి షాకవుతున్నారు.