ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుని టాలీవుడ్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ సుందరి.. ప్రస్తుతం `పుష్ప` ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో ముచ్చటగా మూడోసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 17న విడుదలకు ముస్తాబైంది.
విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. రష్మిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను శ్రీవల్లి పాత్రను పోషించిన విషయం అందరికీ తెలిసిందే. తెరపై శ్రీవల్లి కాస్త క్యూట్ గా .. మరికాస్త కన్నింగ్ గా కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది.
అలాగే పుష్ప సాంగ్స్‌లో బన్నీ డ్యాన్స్‌ను మ్యాచ్ చేసేందుకు ఎంతో కష్టపడ్డానని.. ముఖ్యంగా `సామి సామి..` పాట మూమెంట్స్ చాలా కష్టంగా అనిపించాయని పేర్కొంది. ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన రష్మిక `సమంత చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూసి నేను షాక్ అయ్యాను. అయితే ఆమెలా నేను చేయను. నాకు స్పెషల్ సాంగ్స్ చేసే ఆలోచనే లేదు` అంటూ వ్యాఖ్యానించింది. దీంతో రష్మిక కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారియి.