టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇటీవల ఆమె తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. అయితే ఈ విషయాలన్నింటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఈ బ్యూటీ. కాగా పర్సనల్ విషయాలను పక్కనబెట్టిన సమంత, సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గనంటూ దూసుకుపోతుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో ‘‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా..’’ అనే హాట్ హాట్ పాటలో అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ పాటలో సమంత హాట్ హాట్ అందాలతో పాటు హాట్ స్టెప్స్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, పుష్ప సినిమాలో ఈ పాట సూపర్ హిట్‌గా నిలవడం ఖాయమని ప్రేక్షకులు పూర్తి ధీమాగా ఉన్నారు. ఇక సమంత ఇటీవల ఎక్కువగా దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంది. తాజాగా ఆదివారం నాడు ఆమె మరోసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. అయితే అక్కడి వాతావరణం ఆమెకు అనుకూలించకపోవడంతో, సమంత తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.
అయితే కేవలం హెల్త్ చెకప్ కోసమే సమంత ఆసుపత్రికి వెళ్లిందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా సమంత ఆసుపత్రిలో చేరిందనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడంతో, అటు సినీ వర్గాలతో పాటు ఆమె అభిమానులు కూడా సమంత ఆరోగ్యం ఎలా ఉందా అనే విషయం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సమంత ఆరోగ్యంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో సమంత ఆరోగ్యంపై మరికొద్ది నిమిషాల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి.