క్రాక్ సినిమా విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ న్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా నటించనున్నారు. రెవెన్యూలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసే క్యారెక్టర్ ను రవితేజ పోషిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 25 వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ ఒక అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు.
అందులో ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేస్తుండగా.. రవితేజ ఒక కర్ర పట్టుకొని పోలీసులపై పోరాటానికి దిగినట్లుగా ఉంది. ఇది రవితేజ అభిమానులను ఆకట్టుకుంటోంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో వరుసగా అగ్రహీరోల నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి. అటు సమ్మర్ లో కూడా మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ సలార్ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చిలో రవితేజ తన సినిమాను విడుదల చేస్తున్నాడు.
Rama Rao will report in Theatres from 25th March 2022 😎#RamaRaoOnDuty #RamaRaoOnDutyFromMarch25 @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @Cinemainmygenes @sathyaDP @SamCSmusic @sahisuresh @RTTeamWorks pic.twitter.com/04TWTMqj43
— SLV Cinemas (@SLVCinemasOffl) December 6, 2021