నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
రొటీన్ కథనే అయినప్పటికీ.. అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. అలాగే అఖండ, మురళీ కృష్ణ పాత్రలకు తనదైన మాస్ నటనతో, డైలాగ్ డెలివరీతో ప్రాణం పోశారు బాలయ్య. మరోవైపు తమన్ అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ ప్రభంజనం సృష్టిస్తోంది.
విడుదలై నాలుగు రోజులు గడిచినా అఖండ జోరు మాత్రం తగ్గేలేదు. ఇదిలా ఉంటే.. ఒక భాషలో హిట్టైన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వ సాధారణం. ఈ నేపథ్యంలోనే అఖండ చిత్రం బాలీవుడ్‌కి వెళ్తోందట. మాస్ సినిమా కావడం మరియు అఖండలో దేవాలయాల పరిరక్షణ, హిందుత్వం గురించి బలమైన సీన్లు ఉండటంతో..నార్త్ ఇండియన్ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే పలువురు బాలీవుడ్ నిర్మాతలు అఖండ రీమేక్ హక్కులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారట. ఇక ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ అయితే అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ వంటి హీరోలు బాగా సెట్ అవుతారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.