పుష్ప రాజ్ స్ట్రైక్స్ : మోత మోగుతున్న సోషల్ మీడియా..!

నిన్న రాత్రి యూట్యూబ్ లో విడుదలైన పుష్ప ట్రైలర్ రికార్డుల పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ముందుగా ఈ ట్రైలర్ ను నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా అనుకున్న సమయానికి ట్రైలర్ విడుదల చేయలేక పోయారు.

ఆ తర్వాత ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేది అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. ఇక నిన్న పుష్ప ట్రైలర్ విడుదల కాదేమోనని అంతా భావించారు. అభిమానుల పూర్తిగా నిరాశ పడ్డ సమయంలో అనూహ్యంగా 9:30 గంటల సమయంలో పుష్ప ట్రైలర్ నాలుగు భాషల్లో విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ఆలస్యంగా విడుదల అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన పన్నెండు గంటల్లోనేఅన్ని భాషల్లో కలిపి 15 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో కూడా పుష్ప ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పుష్ప లో చిత్తూరు యాసలో బన్నీ అదరగొట్టాడు. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందన్న లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కాగా పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.

 

Share post:

Latest