ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్ పాత్రలను పోషించారు. ఎర్ర స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.
అయితే మొదటి పార్ట్‌ను పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయగా.. డివైట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మరియు అమెరికాలోనూ కూడా భారీ వసూళ్లు రాబడుతోంది.
అయితే ప్రస్తుతం పుష్పరాజ్‌కు జోరుకు బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా మంగళవారం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. బాలీవుడ్‌లో బాగానే దూసుకుపోతున్నా.. సౌత్‌లో మాత్రం పుష్ప తేలిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. కానీ సెకెండ్ వీక్ వచ్చే సరికి అక్కడ కూడా కలెక్షన్లు పడిపోతున్నాయి.
టిక్కెట్ ధరల సమస్యలు, ఏపీలో థియేటర్ల మూసివేత వంటి అంశాలు పుష్ప కలెక్షన్లు తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని అంటున్నారు. ఏదేమైనప్పటికీ.. ఓ పాన్ ఇండియా చిత్రం రెండో వారానికే చతికిల పడటం చిత్రయూనిట్‌కి బిగ్ షాకనే చెప్పాలి.