ఇంట్ర‌స్టింగ్‌గా `అర్జున ఫల్గుణ` ట్రైల‌ర్‌.. ఎన్టీఆర్‌నూ వాడేశారుగా!

December 24, 2021 at 2:48 pm

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం `అర్జున ఫ‌ల్గుణ‌`. తేజా మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. అమృత అయ్యర్ హీరోయిన్‌గా న‌టించ‌గా..నరేష్‌, శివాజీ రాజా, దేవీ ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ స్వరాలందించారు

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 31న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్.. తాజా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. మంచి ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న ఈ ట్రైల‌ర్ థ్రిల్లింగ్‌నే కాకుండా ఫన్ ఎలిమెంట్స్ తో సాగింది. గంజాయి మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింద‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థం అయింది.

పోలీస్ ఆఫీసర్ గా నటుడు సుబ్బరాజ్ ట్రైల‌ర్‌లో కనిపించారు. అయితే చివ‌ర‌కు హీరో ఓ మూట పట్టుకొని పోలీసులకు, రౌడీలకు దొరక్కుండా పారిపోతూ కనిపించాడు. అసలు ఆ మూటలో ఏముందో తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. ఇక‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ను కూడా ఈ సినిమాలో బాగానే వాడేశారు. అవును, ఈ సినిమాలో శ్రీ‌విష్ణు మ‌రియు అత‌డి ఫ్రెండ్స్ ఎన్టీఆర్‌కి వీరాభిమానులుగా క‌నిపించ‌బోతున్నారు.

కాగా, `రాజ రాజ చోర`తో మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుని జోరు మీద ఉన్న శ్రీ‌విష్ణు..అర్జున ఫల్గుణ తో మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకుంటాడో..లేదో.. తెలియాలంటే డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

ఇంట్ర‌స్టింగ్‌గా `అర్జున ఫల్గుణ` ట్రైల‌ర్‌.. ఎన్టీఆర్‌నూ వాడేశారుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts