ప్ర‌భాస్ మామూలోడు కాదు..ఆ విష‌యంలో దీపికానూ ప‌డేశాడుగా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అతిథి మర్యాదలు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా తోటి న‌టుల‌కు వెరైటీ వెరైటీ వంట‌కాలను రుచి చూపిస్తూ.. వాళ్ల‌పై ఓ రేంజ్‌లో ఫుడ్ ఎటాక్ చేస్తుంటాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే సాహో చిత్రీకరణ సమయంలో శ్ర‌ద్ధా క‌పూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్‌.. ఇటీవ‌ల‌ సలార్‌ బ్యూటీ శ్రుతిహాసన్‌కు, అదిపురుష్ భామ కృతి స‌న‌న్‌కు దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

ఇప్పుడు ఫుడ్ విష‌యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణేను సైతం ప‌డేశాడు ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ క‌లిసి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ వ‌ర‌ల్డ్ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. `ప్రాజెక్ట్-కె` వ‌ర్కింగ్ టైటిల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా వేసిన సెట్‌లో ప్ర‌భాస్‌- దీపికాల‌పై ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇక హైద‌రాబాద్‌లో ఉన్న దీపికాకు ప్ర‌భాస్ ఎప్పటిలా వివిధ రకాల వంటకాలను త‌యారు చేసింది ఆమెకు పంపించారు. దీంతో ఆ వంట‌కాల‌న్నిటినీ చూసి దీపికా ఆశ్చ‌ర్య‌పోయింది. అంతే కాదు, `If you know you know` హ్యాష్‌ట్యాగ్‌తో.. ఆ ఫుడ్ ఐటమ్స్ ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

Share post:

Popular