టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్నానికి దేవిశ్రీ ప్రసాద్ సంగతం అందిస్తున్నారు.
అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న మొత్తం ఐదు భాషల్లోగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం నిర్వహించారు. హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ఈ ఈవెంట్ జరిగింది.
ఈ వేడుకకు రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేసి.. పుష్పపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశారు. అయితే ఇందంతా బాగానే ఉందిగానీ.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఈవెంట్‌కి కేవలం 5000 పాసెస్ మాత్రమే తీసుకుని ఎక్కువ పాసులు జారీ చేశారని పోలీసులు నిర్ధారించారు.
దీంతో శ్రేయాస్ క్రియేషన్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్ పై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ అండర్ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకుని షాకైన బన్నీ.. విడుదలకు ముందు ఇటువంటి తలనొప్పులు ఏంటని మేకర్స్‌పై ఆసహనం వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.