మరో వివాదంలో పుష్ప ఐటమ్ సాంగ్ .. సమంతపై కేసు నమోదు..!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ వివాదాలను కొని తెస్తోంది. ఇప్పటికే ఈ పాటలో సమంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేసిందని.. డ్రెస్ కూడా అలాగే ఉందని.. కావాలనే సమంత నాగచైతన్యను రెచ్చగొడుతోందని..అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా మీదగా ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప ఐటమ్ సాంగ్ పై మరో వివాదం వచ్చింది. పుష్ప మూవీలోని ఊ.. అంటావా.. మామ.. ఊ..ఊ.. అంటావా పాట సాహిత్యం మగవాళ్ళను కించపరిచే విధంగా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సంస్థ కేసు వేసినట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల కిందట పుష్ప మూవీ లోని స్పెషల్ సాంగ్ లిరిక్ విడుదల కాగా, నిన్న సాయంత్రం ఈ సాంగ్ వీడియో కూడా క్లిప్ విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. యూట్యూబ్ లో నెంబర్ టూ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పాటలోని సాహిత్యం మగ జాతిని కించపరిచేలా ఉందని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సంస్థ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. మగవాళ్ళ క్యారెక్టర్ ను దిగజారుస్తూ మరీ సాహిత్యం రాశారని.. వెంటనే పుష్ప చిత్రయూనిట్ ఇందుకు క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది.

సినిమా నుంచి ఐటమ్ సాంగ్ ను తొలగించాలంటూ ఆ సంస్థ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సమంత పై కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం అందించాడు. మంగ్లీ సోదరి చంద్రావతి చౌహాన్ ఈ పాట పాడింది. ఈ ఐటమ్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత పై చిత్రీకరించారు. కాగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ పై వస్తున్న వివాదానికి చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కాగా ఐటెం సాంగ్ సాహిత్యానికి.. సమంత కు ఎటువంటి సంబంధం లేదని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.