ఓటీటీలో బిగ్‌బాస్.. ఇక ఎంట‌ర్‌టైన్మెంట్ మామూలుగా ఉండ‌దు!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 5 అయిపోయింద‌ని ఫీల్ అవుతున్న బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌కు కింగ్ నాగార్జున తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలియ‌జేశారు. ఇంత‌కీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. బిగ్‌బాస్ షో త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో 24X7 ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంద‌ట‌.

ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ యాజమాన్యంతో పాటు కింగ్ నాగార్జున ప్రకటించారు. శుక్రవారం ఉదయం హాట్‌స్టార్ వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగ్ ఓటీటీ బిగ్‌బాస్ గురించి అఫీషియల్ గా ప్ర‌క‌టించారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యం ఇటీవ‌ల‌ నావద్దకు వచ్చి..“బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం“అని చెప్పడంతో షాక్‌ అయ్యాను.

చివరికి వాళ్లు న‌న్ను ఒప్పించారు. బిగ్‌బాస్‌కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్‌బాస్‌ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బాస్‌ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్‌హిట్‌. త్వరలోనే ఓటీటీలోనూ బిగ్‌బాస్ ప్రారంభం కానుంది` అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.

ఇక ప్ర‌స్తుతం షో ఎలా ఉండాలి? ఎంతమంది కంటెస్టెంట్స్‌? ఎన్ని రోజులు? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తామ‌ని నాగార్జున ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. దీంతో బిగ్‌బాస్ ప్రియులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, హిందీలో ఇప్పటికే ఓటిటి బిగ్ బాస్ ప్రసారమై ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రి తెలుగులో బిగ్ బాస్ ఓటిటి ఫార్మాట్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Share post:

Popular