కొమురం భీముడో.. మంట లేపినావు కొడుకో!

December 24, 2021 at 8:05 pm

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను జాతీయ స్థాయిలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో విధ్వంసకరమైన నటనను చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ముందు నుండీ చెబుతూ వస్తోంది.

తాజాగా తారక్ పాత్రకు సంబంధించిన కొమురం భీముడో అనే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన లిరిక్స్‌తో రాయగా, ఈ పాటను సింగర్ కాలభైరవ అంతకంటే అద్భుతంగా పాడాడు. ఈ పాట వింటున్నంత సేపు ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ రావడం ఖాయం. కొమురం భీం పాత్రను ఎలివేట్ చేస్తూ ఆయన దేశభక్తిని తెలిపే పాటగా సుద్ధాల అశోక్ తేజ లిరిక్స్ అందించాడు. కాగా ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ పాట రిలీజ్ అయిన కొద్దసేపటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తూ అదిరిపోయే వ్యూస్‌ను దక్కించుకుంటోంది.

ఇక కేవలం థీమ్ సాంగ్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయంటే ఈ పాటలు సినిమాలో చూస్తున్నప్పుడు ఎలా ఉంటాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అటు రామ్ చరణ్ రామరాజు పాత్రలోనూ చెలరేగిపోయి నటించాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను గాయబ్ చేసిన సంగతి తెలిసిందే. మరి జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

కొమురం భీముడో.. మంట లేపినావు కొడుకో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts