`ఆహా`కు బిగ్ షాక్‌.. అదిరిపోయే న్యూస్ లీక్ చేసేసిన మ‌హేష్‌!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`కు బిగ్ షాక్ ఇచ్చాడు మ‌హేష్ బాబు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఆహా వారు `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` షోను ర‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ టాక్ షో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. మొద‌టి ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. అలాగే నాలుగో ఎపిసోడ్‌కు అఖండ టీమ్ హాజ‌రు అయ్యారు. ఈ విషయాన్ని ఆహా టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే నాలుగో ఎపిసోడ్ ఇంకా స్ట్రీమ్ అవ్వ‌కుండానే ఐదో ఎపిసోడ్‌కి వ‌చ్చే గెస్ట్ ఎవ‌ర‌న్న‌ది లీక్ అయిపోయింది.

ఇంత‌కీ ఐదో ఎసిసోడ్ గెస్ట్ ఎవ‌రో కాదు.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబే. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షూట్ సైతం కంప్లీట్ అయిపోయింది. ఈ అదిరిపోయే న్యూస్‌ను మ‌హేష్ బాబు స్వ‌యంగా లీక్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో బాలయ్యతో టాక్ షోలో పాల్గొన్న ఫోటో పంచుకున్నాడు మ‌హేష్‌.

అంతే కాదు, బాలకృష్ణ గారితో ఈ సాయంత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను అంటూ కామెంట్ చేశారు. దీంతో వ‌చ్చే వారం అన్ స్టాప‌బుల్ షో వేదిక‌పై బాల‌య్య‌తో సంద‌డి చేసేది మ‌హేష్ బాబే అని క‌న్ఫార్మ్ అయింది. కాగా, మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతోంది.

 

Share post:

Latest